టార్గెట్ వెంకయ్యనాయుడు: ఏపీలో ఇక వికసించే కమలాన్ని అడ్డుకొనేదెవరు??

Target Venkaiah Naidu Now BJP blooms in AP as Naidu becomes VP

ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా వెంకయ్యను ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆదివారమే అమిత్‌షా ప్రధాని మోడీ నిర్ణయాన్ని వెంకయ్యకు వివరించినా  తాను క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు వెంకయ్యనాయుడు. అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, అమిత్‌షా, మోడీలతో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగిన సమావేశంలో వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వాన్నే ఖరారు చేయాలని నిర్ణయించారు. వెంకయ్య అభ్యర్ధిత్వం విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనా రాష్ట్రపతిగా ఉత్తరాది వ్యక్తిని ప్రకటించిన నేపథ్యంలో దక్షిణాది వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అనుభవజ్ఞుడైన నాయకుడిగా గుర్తింపు ఉండటంతో ఆయనే సరైన అభ్యర్ధి అని పార్లమెంటరీ బోర్డు భావించింది. గతంలో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగి ఉండటం కూడా ఆయన ఎంపికకు కారణమయ్యాయి.

Target Venkaiah Naidu Now BJP blooms in AP as Naidu becomes VP

మరోవైపు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మన తెలుగుతేజం వెంకయ్యనాయుడు మొదటినుండి తెలుగుదేశం పార్టీతో ఎంతో దగ్గరి సంబంధాలు ఉంచుకున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తరువాత చంద్రబాబు నాయుడుకి మరింత దగ్గరయ్యారు వెంకయ్య. అంతేగాక చంద్రబాబుని మోడీకి దగ్గర చేయడంలో వెంకయ్య ఎంతో  కృషి  చేశారు.

తెలంగాణాలో కాస్త బలంగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బిజెపి ఎదుగుదల ఏమాత్రం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాస్త వెనుకంజలోనే ఉంది. అంతేగాక గత కొన్నినెలలుగా దక్షిణాదిలో పాగా వేయాలని డిసైడ్ అయి బిజెపి బలోపేతానికి కమలాధిపతి అమిత్‌ షా ఏకంగా రంగంలో దిగి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందులోభాగంగా చంద్రబాబు, వెంకయ్య దేశంలో లేనప్పుడే వీళ్ళిద్దరికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చి మరీ భేటీ అయిన మోడీ, అమిత్‌ షా తమ ప్లాన్స్‌ని నెమ్మదిగా వర్కౌట్ చేస్తున్నారు.

అంతేగాక రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని పార్టీ నాయకులు అందరూ అమిత్‌ షా దగ్గర మోకరిల్లినా వెంకయ్యగారు మధ్యలో కలగచేసుకొని చంద్రబాబుతో సంబంధాలు తెగిపోకుండా చాలా జాగ్రత్త తీసుకొని విందు సమావేశం ఏర్పాటు చేశారు. అంతేగాక దేశం మొత్తం వెంకయ్య పార్టీ కోసం పనిచేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి మాత్రం తమ కులానికి చెందిన విషయాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతారనేది ఎపిలో ఎవరని అడిగినా చెప్పేస్తారు.

See Also: అయ్యా కావూరి… నీకు చంద్రబాబు ఎప్పుడూ నచ్చడా???

ఏపిలో బిజెపి ఎదగాలని వెంకయ్య ఏమాత్రం ఇష్టపడ్డా తన కులానికే చెందిన కంభంపాటి హరిబాబుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనిచ్చే వారు ఏమాత్రం కాదు. ఎందుకంటే పార్టీని ముందుకు నడిపించే సామర్థ్యం హరిబాబుకి లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎపిలో పార్టీలో కాస్త బలంగా ఉండి ఎవరినైనా ఎదుర్కోగలిగే సత్తా ఉన్న నాయకుడైన సోము వీర్రాజు తెలుగుదేశాన్ని మొదటినుండి చాలా గట్టిగా విమర్శిస్తూనే ఉన్నారు. అందుకే పార్టీ పగ్గాలు వీర్రాజుకి ఇస్తే తెలుగుదేశం బిజెపి మిత్రబంధం తెగిపోతుందని భావించిన వెంకయ్యనాయుడు సోము వీర్రాజుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుకాకుండా అడ్డుకున్నారని బిజెపి వర్గాలు ఇప్పటికీ గుసగుసలాడుకుంటూనే ఉన్నాయి. అందుకే వెంకయ్య నాయుడు టార్గెట్‌గా మోడీ, అమిత్’ షాలు వేసిన స్కెచ్‌లో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవిని అంటగట్టి క్రియాశీల రాజకీయాలనుండి రిటైర్డ్ హర్ట్ చేయాలని డిసైడ్ చేసుకొని సక్సెస్ అయ్యారు. కాబట్టి, ఇప్పుడు అమిత్ షా ఏపిలో బిజెపి బలోపేతంపై దృష్టి పెట్టేయొచ్చు

మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్ధిత్వంపై వెంకయ్య అసంతృప్తితో ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లో ఇంకొంత కాలం కొనసాగాలనే తన ఆసక్తిని వెంకయ్య వ్యక్తం చేసినా మోది అమిత్ షా ల వ్యూహం కారణంగా ఇష్టం లేని పదవిని అంగీకరించక తప్పలేదు. అయితే పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పిన వెంకయ్య మంగళవారం ఎన్డీఏ పక్షాల తరపున నామినేషన్‌ వేయనున్నారు. అంతేగాక ఉపరాష్ట్రపతిగా అభ్యర్ధిత్వం ఖరారైన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవులకు వెంకయ్య రాజీనామా చేయనున్నారు.

See Also: కేంద్రం నిర్ణయంపై కమలనాథుల భిన్నాభిప్రాయాలు

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.