టార్గెట్ ప్రశాంత్ కిషోర్

TDP leaders fires on YSRCP Chief Jagan and Prashanth Kishore

వైఎస్సాఆర్సీపీ ప్లీనరీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి పరిచయం చేసిన తర్వాత విమర్శలకు పదునుపెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు. జగన్‌ని టార్గెట్ చేసుకొని మండిపడుతున్నారు.

TDP leaders fires on YSRCP Chief Jagan and Prashanth Kishore

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్‌ అసూయపడుతున్నారని.. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి నారా లోకేశ్. చంద్రబాబును తిట్టడం కోసమే వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రకటించిన హామీలన్నీ 2014 ఎన్నికల్లో తాము హామీ ఇచ్చి అమలు చేసినవేనని స్పష్టంచేశారు లోకేశ్. అప్పట్లో చంద్రబాబు నెరవేర్చలేని హామీలిచ్చారని విమర్శించిన జగన్‌.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అవే హామీలు తానూ ఇస్తున్నారని లోకేశ్‌ విమర్శించారు. అంతేగాక తన సారథ్యం మీద నమ్మకం లేకనే జగన్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను తెచ్చుకున్నారని ఆరోపించారు.

ఐదు కోట్ల మంది ప్రజల్లో కాకుండా బయటి వ్యక్తిని తెచ్చి ఎన్నికల్లో గెలిపిస్తారని చెప్పటం వైసీపీ రాజకీయ దివాలాకోరుతానానికి నిదర్శనమన్నారు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. ప్రశాంత్ కిషోర్‌ను  తీసుకొచ్చి జ‌గ‌న్ తెలుగు ప్రజలను అవమానించార‌ని.. 2019లో జరిగే ఎన్నికల  రణరంగంలో తెలుగుదేశం పార్టీనే విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు

See Also: 30 ఏళ్ళు సీఎంగా పాలించాలన్నదే నా కోరిక: వైఎస్ జగన్

ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు పాదయాత్ర చేస్తే.. వైసీపీ మాత్రం ఎన్నికల కోసం చేస్తామనటం పాదయాత్రలను అవమానించినట్లే మండిపడ్డారు డొక్కా. అంతేగాక ప్రభుత్వాన్ని విమర్శించటానికే వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారని, వైసీపీ అధినేత జ‌గ‌న్ అవగాహనలేమి, అమలు కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరుతుంటే.. ప్రజలను మభ్యపెట్టేందుకు, వారి ఆలోచనలు మళ్లించేందుకే జగ‌న్ స‌మావేశాలు పెట్టారని మండిపడ్డారు డొక్కా.

See Also: టార్గెట్ 2019: జగన్‌కోసం రంగలోకి ప్రశాంత్ కిషోర్?

మరోవైపు ప్రతిపక్షాల తీరును తెలుగుదేశం కార్యకర్తలు అవగాహన చేసుకోవాలని కోరారు ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్. వైసీపీ ప్లీనరీ జరిగిన తీరుపై మండిపడ్డారు. ఆ ప్లీనరీని పరిశీలిస్తే.. ఆలీ బాబా అందరూ దొంగలే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లీనరీలో ప్రశాంత్‌ కిశోర్‌ను పరిచయం చేసి ఆయనే సారథ్యం వహిస్తారని చెప్పడం ద్వారా తాను జైలుకు పోతాను అని ప్రతిపక్షనేత చెప్పకనే చెప్పారన్నారు. దశల వారీగా మద్యనిషేధం చేస్తానన్న ప్లీనరీ సమావేశంలో వేదిక మీద ఉన్న వాళ్లు మద్యపానం మానేస్తే రాష్ట్రంలో సగం మంది మద్యం మానేసినట్లే అని అన్నారు మంత్రి జవహర్.

See Also: ఆగస్టులో మహాయుద్ధం: గెలుపెవరిది??

Have something to add? Share it in the comments

Your email address will not be published.