విశాఖ సాగర తీరాన పసుపు పండుగ

TDP Mahanadu decided to be organized for 3 Days from May 27th in Vizag

TDP Mahanadu decided to be organized for 3 Days from May 27th in Vizag

ప్రతీయేడాది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు వేదిక సిద్ధమైంది.  ఈ సంవత్సరం మహానాడు సంబరాన్ని విశాఖలో మే 27 నుండి మూడు రోజులపాటు నిర్వహించడానికి పసుపు తమ్ముళ్ళు ప్రణాళిక సిద్ధం చేశారు. విశాఖలో మహానాడు నిర్వహించడానికి చంద్రబాబు సైతం ఓకె చెప్పడంతో జిల్లాలో ఏ ప్రాతంలో అయితే మహానాడు విజయవతంగా నిర్వహించగలుగుతామ్మ ఆలోచనల్లో ఉన్నారు పార్టీ నాయకులు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతీయేడాది మూడు రోజులపాటు మహానాడు నిర్వహించడమనేది ఆనవాయితీగా మారింది. అయితే దాదాపు ఇన్నేళ్ళు మహానాడు కార్యక్రమాన్ని హైదరాబాద్‌ శివార్లలలోని గండిపేటలో నిర్వహిస్తుండగా గతేడాది సంప్రదాయానికి భిన్నంగా తిరుపతి నిర్వహించారు తెలుగు తమ్ముళ్ళు. అయితే ఈ యేడాది జరిపే మహానాడు స్థలం విషయంలో తర్జనభర్జన పడ్డ నాయకులు చివరికి విశాఖలో మూడు రోజుల వేడుక నిర్వహించడానికి తలపెట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.