సాక్షి పత్రికపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే అనిత

TDP MLA Anitha requested speaker to take action on Sakshi Daily paper

TDP MLA Anitha requested speaker to take action on Sakshi Daily paper

జాతీయ మహిళా పార్లమెంట్ జరిగినప్పుడు స్పీకర్ వ్యాఖ్యలపై మళ్ళీ దుమారానికి తెరలేపారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా సాక్షి పత్రికపై తమ అక్కసు వెళ్ళగక్కారు. వీలైనంత తొందరగా సాక్షి పత్రిక ఎడిటర్ , పబ్లిషర్‌ను ప్రివిలేజ్డ్ కమిటీ ముందు హాజరు పరిచేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు.

అనిత మాట్లాడుతూ ‘ మా డిమాండ్ ప్రకారం ఏదైతే సాక్షి పేపర్ దుష్ప్రచారం చేసిందో జాతీయ మహిళా పార్లమెంట్‌‌కు సంబంధించి మీమీద సాక్షి పేపర్ దుమారం రేపింది. దుష్ప్రచారం చేసింది. దానికి సంబంధించి మీ అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం… ప్రజలలందరికీ ఆ రోజు ఏం జరిగిందో తెలియానే ఉద్దేశ్యంతో ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వీడియోను మీ అనుమతితో డిస్ప్లే చేశాం. ఇన్ని అవాకులు చేస్తున్నారు ఏదిపడితే అది రాస్తున్నారు పేపర్లో మరి ఆ రోజు సభలో ఉండి ఏం జరిగిందో చూడడడానికి దమ్ము ఎందుకులేదని ప్రశ్నిస్తున్నాను. ఆరోజు అది చూపిస్తామని చెప్పి ఆ రోజు సభలో సభ్యులెవరినీ కూడా ఉంచడం మానేసి ఆయన కూడా పలయానం చిత్తగించిన పరిస్థితి ఆరోజు మనం చూశాం అధ్యక్షా.’ అన్నారు అనిత.

అంతటితో ఆగకుండా ‘ జాతీయ మహిళా పార్లమెంట్‌కు పెద్ద పెద్ద వాళ్ళు చాలామందే వచ్చారు. దీనికి సంబంధించి 120 రోజులనుండి ఎంతో శ్రమించి చేశారు. ప్రివిలేజ్డ్ కమిటీకి ఇచ్చిన నోట్ మీకు ఇచ్చాం. దీనిపై అతితొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ెందుకంటే సాక్షి చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజల్లో అనవసరంగా అపోహలు గురౌైతున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి ఎందుకంటే మామీద చాలా అవాకులు చెవాకులు దుష్ప్రచారాలు చేశారు. కానీ సభా స్పీకర్‌గా ఉన్న మీమీద కూడా , మిమ్మల్ని కూడా సభమీద ఎటువంటి గౌరవంలేకుండా మీమీద కూడా చేసిన ఆరోపణలు అసత్యపు ఆరోపణలు అని మా అందరికీ తెలుసు. ఎందుకంటే మేమందరం చూశాం కాబట్టి. వాళ్ళు చూళ్ళేదు అధ్యక్షా.. ఈ విషయంలో మాత్రం సాక్షికి సంబంధించి పబ్లిషర్‌ను కానీ ఎడిటర్‌ను కానీ ఖచ్చితంగా ఇక్కడికి పిలిపించి ప్రివిలేజ్డ్ కమిటీ ద్వారా విచారణ చేసి తప్పొప్పులు ఏదైతే ఉన్నాయో వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దీనిపై అతి తొందరగా చర్యలు తీసుకుంటే సాక్షి పేపర్‌కు సంబంధించిన దుష్ప్రచారం ఆగుతాయని మా ఉద్దేశ్యం . ‘ అని ముగించారు అనిత.

Have something to add? Share it in the comments

Your email address will not be published.