‘కేశినేని’ మరో విజయ్‌మాల్యానా????

TDP MP Kesineni a la VijayMalya alleges YSRCP MLA Chevireddy

TDP MP Kesineni a la VijayMalya alleges YSRCP MLA Chevireddy

గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం కేశినేని ట్రావెల్స్ మూసివేత. ఆర్టీఓ అధికారి సుబ్రహ్మణ్యంతో గొడవ తర్వాత ముఖ్యమంత్రి జోక్యంతో కాస్త వెనక్కి తగ్గిన ఎంపీ కేశినేని నాని ఒక్కసారిగా ట్రావెల్స్ మూసేస్తున్నట్లు ప్రకటించేశారు. అయితే టీడీపీ ఎంపీ నాని ట్రావెల్స్‌ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందంటున్నారు వైసీపీఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.

బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన కేశినేని నాని, మరో విజయ్‌ మాల్యాలా తయారయ్యాడని దుయ్యబట్టారు. ఈ తతంగమంతా ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకే జరిగిందని, కేశినేని ట్రావెల్స్‌ను మూసివేస్తున్న నిర్ణయం కూడా చంద్రబాబుకు తెలిసే జరిగిందని అంటున్నారు చెవిరెడ్డి. బ్యాంకుల వద్ద నుంచి వందలకోట్ల అప్పు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు.

అంతేగాక ట్రావెల్స్‌లో బస్సులకోసమని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న డబ్బులతో కేశినేని నాని విజయవాడలో ఓ పెద్ద స్టార్ హోటల్‌ కడుతున్నారని విమర్శించారు. అంతేగాక ఆర్టీసీకి నష్టంవచ్చేలా బస్సులు తిప్పిన కేశినేనికి సంబంధించిన కేశినేని బస్సులను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.