టీఆర్ఎస్‌లో హరీష్ చచ్చినపాము అంటున్న రేవంత్ రెడ్డి

TDP President Revanth reddy fires on TRS party and Harish Rao

TDP President Revanth reddy fires on TRS party and Harish Rao

గత కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉన్న టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధికారపార్టీపై ధ్వజమెత్తారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దళితులకు, నిరుద్యోగులకు, మైనారిటీలకు, రైతులకు, విద్యార్థులకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల కోసం నిధులు కేటాయించని కెసిఆర్ సర్కార్ అప్పులను మాత్రం 60వేల కోట్ల నుండి 140వేల కోట్లకు పెంచిదని విమర్శించారు. అంతేగాక సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణా ప్రజలకు జరిగిన ఒరిగిందేమీలేదన్న రేవంత్ టీఆర్ఎస్‌లో మంత్రి హరీశ్ రావు చచ్చినపాములాంటి వాడని విమర్శించారు.

టీడీపీ హయాంలో మంత్రి పదవి రాకపోవడంతోనే కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించారన్న తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రస్తుతం తెలంగాణాలో  ప్రజల భావోద్వేగాలతో రాజకీయపబ్బం గడుపుకోవడం మినహా పరిపాలనపై పట్టులేదన్నారు. అంతేగాక టీడీపీపై మాట్లాడేస్థాయి, అర్హత మంత్రి కేటీఆర్‌కు లేవన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. టీఆర్ఎస్ కేవలం గాలివాటం పార్టీ అని విమర్శించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి టీడీపీ వదిలి బిజెపిలో చేరబోతున్నారన్న వార్తలు ఈమధ్య బాగా ఎక్కువ చక్కర్లు కొట్టాయి. అయితే తాను ఎక్కడికి వెళ్ళట్లేదని రేవంత్ స్పష్టతఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.