సదారాంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

సదారాంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

బిఎసి సమావేశంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేని టిడిపి ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఈనెల 15న జరిగిన బిఎసి సమావేశానికి తెలంగాణా అసెంబ్లీ కార్యదర్శి సదారాం తమను ఆహ్వానించి అవమానించినందుకు స్పాకర్ మధుసూధనాచారికి ఫిర్యాదు చేశారు. బిఎసి సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరుపున సండ్ర వెంకట వీరయ్య హాజరవగా సస్పెన్షన్‌కు గురైన సభ్యులు బీఏసీ సమావేశానికి ఎలా హాజరవుతారని శాసనసభ వ్వహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

దీంతో సండ్రవెంకట వీరయ్య బీఏసీ సమావేశం నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తమకు అవమానం జరిగిందంటూ స్పీకర్ గడప తొక్కారు టీడీపీ ఎమ్మెల్యే. అయితే తమను ఆహ్వానించిన అసెంబ్లీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.