కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం

tdp won the local bodies election in kadpa

tdp won the local bodies election in kadpa

కడప: కడప స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కైవసం చేసుకున్నారు. టీడీజీ అభ్యర్ధి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) తన సమీప వైసీపీ అభ్యర్ధి వైఎస్ వివేకానంద రెడ్డి పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సమయంలో తొలుత వైసీపీ అభ్యర్ధి ఆధిక్యంలో కోనసాగగా, అనంతరం టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి క్రమక్రమంగా ఓట్లును పెంచుకుంటూ ఆధిక్యంలోకి వెళ్లారు.

కడప స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ, వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల కౌంటింగ్ చివరకు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి విజయాన్ని కట్టబెట్టింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కి 433 ఓట్లు రాగా, వైసీపీ కి 399 ఓట్లు వచ్చాయి. చివరకు 34 ఓట్ల మెజారిటీతో రవి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

కడప

మొత్తం ఓట్లు: 840

పోలైనవి: 839 (99.88 %)

మారెడ్డి రవీంద్రనాద్ రెడ్డి (బి.టెక్. రవి), టీడీపీ : 433

వైఎస్ వివేకానందరెడ్డి, వైసీపీ :  399

చెల్లని ఓట్లు:  7

మెజార్టీ: 34  (విజేత, టీడీపీ )

Have something to add? Share it in the comments

Your email address will not be published.