చంద్రబాబుకి కెసిఆర్ ఫోన్

Telanagana CM KCR greeted AP CM Chandrababu over Phone on his Birthday

Telanagana CM KCR greeted AP CM Chandrababu over Phone on his Birthday

ఎప్పుడూ గిల్లికజ్జాలాడుకొనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లు అప్పుడప్పుడు మాత్రం సందర్భోచితంగా మాట్లాడుకుంటుంటారు. ప్పుడో గవర్నర్ విందులోనో, రాష్ట్రపతిని కలిసినప్పుడు అలా ఏవో కొన్ని సందర్భాల్లోనో మాట్లాడుకొనే ఇద్దరు చంద్రులు ఈరోజు మాట్లాడుకున్నారు.

ఈరోజు (ఏప్రిల్ 20)న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి  ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబునాయుడు ఈరోజుతో 67వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్.. చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. ప్రతిగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.