తెలంగాణా స్టేట్ ఫుడ్ కమిషన్ ఏర్పాటు

Telanagana Food commission formed and CM KCR nominated new members along with Chairman

Telanagana Food commission formed and CM KCR nominated new members along with Chairman

తెలంగాణాలో ఒకదాని తర్వాత ఒక నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. ఇప్పటికే చాలా కమిషన్లకు ఛైర్మెన్లను, సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి లేటెస్ట్‌గా తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్‌ ఛైర్మన్ గా కొమ్ముల తిరుమలరెడ్డిని సీఎం నియమించారు. కమిషన్‌లో ఓరుగంటి ఆనంద్, భానోత్ సంగూలాల్, కొంతం గోవర్దన్‌రెడ్డి, రంగినేని శారద, మూలుకుంట్ల భారతి సభ్యులుగా నియామకమయ్యారు.

తెలంగాణాలో ప్రజలకు నిత్యావసర వస్తువులను సక్రమంగా అడ్డదారులు తొక్కకుండా ఉండేలా చూసుకోవడానికి జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అనుసరించి ఫుడ్ కమిషన్ నియామకం చేపట్టినట్లు సీఎం తెలిపారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న కార్తకర్తలనే ఫుడ్ కమిషన్‌లో నియమించినట్లు వెల్లడించారు. అంతేగాక ప్రజలకు నిత్యావసరాలు సరిగా అందించేందుకు ఫుడ్ కమిషన్‌కు నియంత్రణాధికారాలుంటాయని స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.