జర్నలిస్టులంటే అంత చులకనా???

telanagana-government-neglecting-journalists-welfare-in-the-state

తెలంగాణా ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటుకోసం ప్రస్తుత టీఆర్ఎస్ నాయకులకు తోడుగా నిలబడి పనిచేసిన జర్నలిస్టులను తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే భావన రోజు రోజుకి జర్నలిస్టుల్లో ఎక్కువౌతోంది. సెక్రటేరియట్, టిఆర్ఎస్ బీట్లు చూసే జర్నలిస్టులను పట్టించుకుంటే సరిపోదని తెలంగాణాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరి సంక్షేమాన్ని ప్రభుత్వం చూడాలని జర్నలిస్టు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

telanagana-government-neglecting-journalists-welfare-in-the-state

 

అధికారంలోకి రాకముందూ, వచ్చిన తర్వాత ఒక్కటికాదు అడకుండానే అన్నీ చేస్తామంటూ వరాలు ఇచ్చినప్పటికీ అందులో చాలా విషయాలు మాత్రం కార్యరూపం దాల్చట్లేదనే అసహనం అందరిలో వ్యక్తమౌతోంది. జ‌ర్న‌లిస్టులకు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం కాల‌యాప‌న చేయ‌డం విచార‌క‌ర‌మ‌ని, ఎన్నో పోరాటాల ఫ‌లితంగా ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌మ సంఘం సాధించిన ప‌థ‌కాల‌ను కూడా తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టులు నోచుకోలేక‌పోతున్నార‌ని తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌భుత్వం ఇదే మౌనాన్ని ప్ర‌ద‌ర్శిస్తే ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ రూపొందించక త‌ప్ప‌ద‌ని వారు హెచ్చ‌రించారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ఆరోపించారు. గ‌తేడాది రాష్ట్రంలో సుమారు 11 వేల అక్రెడిటేష‌న్ కార్డులు జారీకాగా, కేవ‌లం 4,800 మంది జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే హెల్త్ కార్డులు మంజూర‌య్యాయ‌ని వారు తెలిపారు. అయితే ఈ యేడాది స‌ద‌రు హెల్త్ కార్డుల్లో కేవ‌లం 60 శాతం మాత్ర‌మే రెన్యువ‌ల్ అయ్యాయ‌ని, మిగ‌తా 40 శాతం జ‌ర్న‌లిస్టుల‌కు రెన్యువ‌ల్‌కు సంబంధించి స‌మాచార‌శాఖ‌నుండి మెసేజ్‌లు అంద‌లేద‌న్నారు.గ‌త యేడాది హెల్త్ కార్డులు క‌లిగియుండి ఈ యేడాది అవి రెన్యువ‌ల్ కాక‌పోవ‌డంతో వివిధ ప్ర‌మాదాల్లో, వ్యాధుల‌కు గురై ఖ‌రీదైన వైద్య సౌక‌ర్యం పొంద‌లేక 20మంది జ‌ర్న‌లిస్టులు మృతి చెందార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Telanagana Government neglecting Journalists welfare in the state

తెలంగాణ ఉద్య‌మం నుండి మొద‌లుకొని రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగినంత వ‌ర‌కు రాష్ట్రంలో సుమారు 440మంది జ‌ర్న‌లిస్టులు, వివిధ వ్యాధుల‌కు గురై ప్ర‌మాదాల్లో మృతి చెంద‌గా, ఎంతో అట్ట‌హాసంగా నిర్వ‌హించిన జ‌న‌హిత కార్య‌క్ర‌మంలో కేవ‌లం 60 కుటుంబాల‌కే ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయం అందించింద‌ని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మృతి చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే స‌హాయం అందిస్తామ‌న‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నించారు.

తెలంగాణ కోసం పోరాడి, ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క‌ముందే మృతి చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు ఆంధ్ర ప్ర‌భుత్వం స‌హాయం చేయాలా? అని వారు ధ్వ‌జ‌మెత్తారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక‌లో న‌మ‌స్తే తెలంగాణ పాత్రికేయుడు ల‌క్ష్మారెడ్డి తెలంగాణ కోసం ఎంతో పోరాడాడ‌ని, చివ‌రికి ఢిల్లీలో సైతం త‌న గ‌ళాన్ని వినిపించి పోలీసుల లాఠీ దెబ్బ‌లు తిన్నాడ‌ని, ఆ జ‌ర్న‌లిస్టు గుండెపోటుకు గురై ప్రాణం కోల్పోయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం స‌హించ‌రానిద‌న్నారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమం ప‌ట్ల‌, చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న లేనివాళ్ల‌ను ప్ర‌భుత్వం వివిధ క‌మిటీల్లో నియ‌మిస్తుండ‌డం వ‌ల్లే రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌న్నారు.

రేపు, మాపు అనుకుంటూ రెండేళ్లుగా జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థ‌లాల విష‌యంలో ప్ర‌భుత్వం కాల‌యాప‌న చేయ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. నిర్మ‌ల్ జిల్లా భైంసాలో ఐదుగురు జ‌ర్న‌లిస్టుల‌పై ఆ జిల్లా ఎంఐఎం పార్టీ అధ్య‌క్షుడు, మునిసిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ జాబేర్ అక్ర‌మ కేసు బ‌నాయించ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో పోస్టింగ్‌లు చేస్తున్న వైనాన్ని త‌మ సంఘం తీవ్రంగా ఖండిస్తుంద‌న్నారు.ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు త్రీమెన్ క‌మిటీ నియ‌మించిన‌ట్లు వారు తెలిపారు.

భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించే విధంగా మునిసిప‌ల్ స‌మావేశాల్లో జ‌ర్న‌లిస్టుల‌ను నిషేధిస్తూ ఇటీవ‌లే ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని శ్రీ‌నివాస్‌రెడ్డి, అమ‌ర్‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం (టీయూడ‌బ్ల్యూజే) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విరాహ‌త్ అలీ, ఐజేయూ కార్య‌వ‌ర్గ స‌భ్యులు ఎం.ఏ. మాజిద్‌లు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.



  • యస్.నరసింహ చారి says:

    పెద్దలు యూనియన్ నాయకులు అన్న మాటలు 100% నిజమని, వారు జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ నుండి ఏలాంటి పిలుపు నిచ్ఛినా డానికి మేము సిద్దం. మీ బాటలో నడుస్తామని తెలియజెస్తున్నాం

  • జోషీ. says:

    TRS ప్రభుత్వం తీరు.. పేరుకు పెద్దిరికం, చెప్పుల మోత.. అనేవిధంగా ఉంది..
    ఏమాత్రం అవగాహన లేనివారు పాలకుల పుణ్యాన పదవుల్లో కొనసాగటం ప్రజల దౌర్భాగ్యం.

  • Rajashekar Joshi. says:

    TRS ప్రభుత్వం తీరు.. పేరుకు పెద్దిరికం, చెప్పుల మోత.. అనేవిధంగా ఉంది..
    ఏమాత్రం అవగాహన లేనివారు పాలకుల పుణ్యాన పదవుల్లో కొనసాగటం ప్రజల దౌర్భాగ్యం.