చంద్రబాబుకి ముంచడమే తెలుసు: కెటిఆర్

Telanagana Minister KTR sensational comments on Chandrababu and Congress leaders

Telanagana Minister KTR sensational comments on Chandrababu and Congress leaders

ఎవరినైనా ఘాటుగా విమర్శించడానికి సందర్భం వచ్చిందంటే ఎదురుదాడి చేసే కెటిఆర్‌ లేటెస్ట్‌గా జగిత్యాలలో జరిగిన జనహిత ప్రగతి సభలో కాంగ్రెస్ టీడీపీ నాయకులను ఆటాడుకున్నారు. మంచి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్‌కు మనసు పడుతలేదని, అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ పార్టీని శాశ్వతంగా ఉప్పుపాతరేద్దామని పిలుపునిచ్చారు కెటిఆర్. సంక్షేమానికి తమ ప్రభుత్వం స్వర్ణ యుగమని, ఎన్నో అపురూపమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతోందని అన్నారు.

అంతేగాక కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాల ప్రాంతానికి చెందిన జీవనరెడ్డి 2004లో పొత్తులో భాగంగా గులాబీ కండువా కప్పుకొని ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2006 ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు పన్నితే జీవనరెడ్డి పావుగా మారాడని విమర్శించారు.

2006 ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీకి దిగితే.. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఉద్యమాన్ని కాపాడుకునేందుకు పోటీకి వెనుకంజవేశారు. కానీ బేరం మాట్లాడుకున్న జీవనరెడ్డి ఎంపీగా పోటీ చేశాడు. ఓడిపోయినా మంత్రి పదవి పొందాడు అని దుయ్యబట్టారు కెటిఆర్. కాళేశ్వరం, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని ప్రభుత్వం భావిస్తుంటే కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నారని, జీవన్‌రెడ్డి అయితే చచ్చిపోయినవారి వేళ్ల ముద్రలు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కెటిఆర్.

కేవలం కాంగ్రెస్ నాయకులను విమర్శించడంతో ఆపేయకుండా టీడీపీని కూడా ఘాటుగా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి జగిత్యాల ప్రాంతం దెబ్బ ఎలా ఉంటుందో తెలుసని చెప్పిన కెటిఆర్ జగిత్యాల దెబ్బ ఎట్ల ఉంటుందో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబుకు తెలిసిందన్నారు. అదే దెబ్బతో ఆయన రాష్ట్రం వదిలిపెట్టి పోయాడని విమర్శించారు.

టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాత్రం చింత చచ్చినా పులుపు చావనట్లు చంద్రబాబు దగ్గర తొత్తుగా మారారని కెటిఆర్ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదలవుతుందని చెప్తపుకొచ్చిన కేటీఆర్‌  ఎల్లంపల్లి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను నింపి వైష్ణవ ఆలయంలా కళకళలాడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.