బీఏసీ సమావేశాలకు రెడీ

Telangana Assembly special session to be held on April 30 BAC meetings today

 Telangana Assembly special session to be held on April 30 BAC meetings today

తెలంగాణా శాసనసభ, శాసనమండలి ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భూసేకరణ చట్టంలో సవరణలు, కల్తీ విత్తనాల నియంత్రణ బిల్లుపై జరిగే చర్చల కోసం భేటీ కానున్నారు. అయితే దీనికి సంబంధించి చర్చించేందుకు ఈరోజు సాయంత్రం శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలు వేరు వేరుగా జరుగనున్నాయి.

ఈ నెల 30న ప్రత్యేక సమావేశంలో రేపటి ఎజెండాకోసం ఈరోజు సాయంత్రం నాలుగింటికి సభాపతి మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభ బీఏసీ సమావేశం జరగనుంది.  మంత్రి హరీశ్‌రావు, విపక్ష నేత జానారెడ్డి ఇతర నేతలు ఇందులో పాల్గొననున్నారు.

సాయంత్రం ఐదుగంటలకు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం  సాయంత్రం మూడు గంటల నుంచి శాసనమండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.