నిర్లక్ష్యానికి గురైనా…చక్కదిద్దుతున్నాం

telangana budget 2017-18: presented by finance minister etela rajender

telangana budget 2017-18: presented by finance minister etela rajender

 • తెలంగాణ బడ్జెట్ రూ 1,49,446 కోట్లు

హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టె అవకాశం లభించడం నా భాగ్యమని ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం తెలంగాణ శాసనసభలో 2017-18 సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత మూడు బడ్జెట్ మాదిగానే ఈ బడ్జెట్ కూడా పేదల సంక్షేమం పట్ల, రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి పట్ల ముఖ్యమంత్రికున్న శ్రదాశక్తులను ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్లక్షానికి గురైన ఆర్ధిక వ్యవస్థని చక్కదిద్దుతూ, ఎంతో కాలంగా అణగారిన ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ తెలంగాణ గత వైభవాన్ని పునరుద్దరించే బృహత్ బాధ్యతను తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వంపై మోపారని ఈటల పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 చీకటి సంవత్సరాలు అనుభించిన తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావించారని, తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు కలిగి ఉన్న విశ్వాసానికి అనుగుణంగా నిలవాలనేదే నిరంతరంగా ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే 19.61 శాతం వృద్ధిరేటులో తెలంగాణ ముందుందన్నారు. 2017-18 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ 1,49,446 కోట్లు అని ఈటల వెల్లడించారు.

2017-18 బడ్జెట్ ముఖ్యాంశాలు:

 • నిర్వహణ వ్యయం రూ 61,407 కోట్లు
 • ప్రగతి పద్దు రూ 88,038 కోట్లు
 • రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు
 • ద్రవ్యలోటు రూ 26, 096 కోట్లు
 • విద్యుత్ రంగానికి రూ 4,203 కోట్లు
 • పారిశ్రామికి రంగానికి రూ 985 కోట్లు
 • రహదారుల అభివృద్ధికి రూ 5,033 కోట్లు
 • విషన్ భగీరథకు రూ 3 వేల కోట్లు
 • పంచాయితి రంగానికి రూ 14, 723 కోట్లు
 • పట్టణాభివృద్ధికి రూ 5,599 కోట్లు
 • ఫీజు రీయంబర్స్ మెంట్ కు రూ 1,939 కోట్లు
 • మేనారీటీ సంక్షేమానికి రూ 1,249 కోట్లు
 • ఆసరా పింఛన్లకు రూ 5,330 కోట్లు
 • బీసీ సంక్షేమానాకి రూ 5,070 కోట్లు
 • ఎస్ట్సీల సంక్షేమానికి రూ 81,645 కోట్లు
 • గిరిజన సంక్షేమానికి రూ 8,615 కోట్లు
 • ఎస్సీల సంక్షేమానికి రూ 14,375 కోట్లు
 • నీటిపారుదలకు 20 వేల కోట్లు
 • వ్యవసాయ రంగానికి రూ 5,942 కోట్లు
 • మహిళా శిశు సంక్షేమానికి రూ 1,731 కోట్లు
 • బ్రాహ్మణ సంక్షేమానికి రూ 100 కోట్లు
 • జర్నలిస్టు సంక్షేమానికి రూ 30 కోట్లు
 • చేనేత సంక్షేమానికి రూ 1,200 కోట్లు
 • ఐటి రంగానికి రూ 252 కోట్లు
 • హరితహారానికి రూ 50 కోట్లు
 • మత్స్యకారులు, నాయిబ్రాహ్మణుల సంక్షేమానికి రూ 500 కోట్లు
 • శాంతి భ్రదతలకు రూ 4,828 కోట్లు
 • పర్యాటకం, సంస్కృతిక రంగాలకు రూ 198 కోట్లు
 • ఆరోగ్యశాఖ రంగానికి రూ 5,976 కోట్లు
 • వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కు రూ 300 కోట్లు
 • మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.350కోట్లు
 • కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే మొత్తం రూ.75,116కు ముందు పెంపు

Have something to add? Share it in the comments

Your email address will not be published.