రిజర్వేషన్లకు మంత్రివర్గం ఓకె

Telangana Cabinet Ahead of special Assembly session, Cabinet approved the reservations proposed quota hike
Telangana Cabinet Ahead of special Assembly session, Cabinet approved the reservations proposed quota hike

తెలంగాణాలో గిరిజనులకు 10, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న నిర్ణయానికి తెలంగాణా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్లతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణాలో మరో రెండు ఎత్తిపోతల పథకాలకు క్యాబినెట్ ఓకె తెలిపింది. కాళేశ్వరం నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీకి నీరు తరలించేలా ఎత్తిపోతలకు ఆమోద ముద్ర వేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణకు తుమ్మిళ్ల ఎత్తిపోతలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిింది. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగులకు 3.66 శాతం డీఏ ఇచ్చేందుకు సమ్మతించింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన మంత్గివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరిచేలా గిరిజనులకు 10, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీటికితోడు మత్స్యకారులకు పరిహారం పెంపు, కాళేశ్వరం, మధ్యమానేరు ప్రాజెక్టుల టెండర్ల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

బిఎసి సమావేశం నుండి సండ్ర వాకౌట్:

రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదముద్ర వేయడానికి వీలుగా రేపు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై శాసనసభ వ్యవహారాల సంఘం భేటీ అయ్యింది.  స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం నుంచి ఖాద్రీపాషా హాజరయ్యారు. అయితే బీఏసీ భేటీకి హాజరైన టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట రమాణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సస్పెండ్ చేసిన తర్వాత బీఏసీకి ఎలా వస్తారు అంటూ బిఎసీలో అభ్యంతరం వ్యక్తం అయ్యింది. సభ ప్రోరోగ్ కానందున సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పీకర్‌ చెప్పడంతో సండ్ర వెంకట వీరయ్య బీఏసీ నుంచి వాకౌట్ చేశారు. దీంతో రేపు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి టీడీపీ సభ్యులకు అనుమతిలేదనే టాక్ వినిపిస్తోంది.

 

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.