నాకెందుకా ‘తలనొప్పి’ అంటున్న కెసిఆర్

Telangana CM KCR denies the chances of expansion in Cabinet

 

Telangana CM KCR denies the chances of expansion in Cabinet

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ దుమారం ప్రతీ రాష్ట్రానికి ఒక గుణపాఠంగా మారింది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత జరిగిన ప్రతీ ఒక్క విషయాన్ని గమనిస్తున్న ఇతర రాష్ట్రాల నాయకులు ఇప్పటికిప్పుడు అలాంటి తలనొప్పులు మాకెందుకులే అనుకుంటున్నారు. సేమ్ ఇదే ఫీలవుతున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తెలంగాణాలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకర ఇప్పట్లో ఉండబోదని చెప్పారు కెసీఆర్. మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే తల పట్టుకున్నారని, తనకెందుకు ఆ తలనొప్పి అని అన్నారు.

మరోవైపు కేబినెట్ భేటీ తర్వాత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మీడియాకు తెలిపారు కెసిఆర్. త్వరలోనే ని యోజకవర్గాల పునర్వవస్థీకరణకు సంబంధిం చిన నిర్ణయం  వందకు వంద శాతం వెలువడుతుందని, ఇది తనకు నిన్న వచ్చిన తాజా సమాచారమని, పార్లమెంటు సమావేశాలు ముగిసినప్పటికీ ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని చెప్పారు. అంతేగాక వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టంపై కేంద్రం ఆమోదం లభిస్తుందని చెప్పారు.

ధర్నాచౌక్‌పై చిల్లరమల్లర రాజకీయాలు:

ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్  ఇందిరాపార్క్ దగ్గర ధర్నాచౌక్ ఉండడం వల్ల తమకు అసౌకర్యం కలుగుతున్నందున ధర్నా చౌక్‌ను మార్చాలని వేసిన పిల్ ఆధారంగా కోర్టు ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయ ప్రదేశం కోరిందని స్పష్టంచేశారు కెసిఆర్. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు అవకాశం ఉండాలని తాను కోరుకుంటానని కెసిఆర్ అన్నారు. కొంత మంది కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ, తాము నిర్ణయించిన చోటే, రక్తాలు పారినా ధర్నా చేస్తామంటున్నారని అన్నారు. దీనిపై చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ధర్నాచౌక్ విషయంలో  తాను నిరసనలు, సభలకు నాలుగైదు ప్రాంతాలు సూచించాలని చెప్పానని, అవి ఎక్కడో తనకు కూడా తెలియదని వివరించారు.

మత కోటా కాదు:

కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో సామాజిక స్వరూపం ఆధారంగా అన్ని వర్గాల రిజర్వేషన్‌లను ఒకే చట్టంగా తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్‌ల బిల్లును ఈనెల 16న సభలో ప్రవేశపెడతామని చెప్పారు. బిసిలకు కూడా అవసరమైన మేరకు త్వరలో రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని,దీనిపై అధ్యయనం చేయాలని బిసి కమిషన్‌ను కోరామని తెలిపారు కెసిఆర్. ముస్లింల రిజర్వేషన్‌లకు సంబంధించి కొంత మంది కావాలనే ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు సీఎం.

ముస్లిం రిజర్వేషన్‌లను మత ప్రాతిపదికన ఇవ్వడంలేదని, అంతే కాకుండా ఇదేమి కొత్తది కాదని, ఇప్పటి కే అమలువుతున్న బిసి-ఇ రిజర్వేషన్‌లను పెంచబోతున్నామని స్పష్టంచేశారు కెసిఆర్.ఒకవేళ కేంద్రం అంగీకరించకపోతే తమిళనాడుకు ఏ ప్రాతిపదికను ఇచ్చారో,తమకు ఎందుకు ఇవ్వడం లేదోనని ప్రశ్నిస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఇక్కడ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్‌లను వ్యతిరేకించడాన్ని ప్రస్తావిం చగా, కేంద్రంలో ఉన్నది పార్టీ ప్రభుత్వం కాదన్నారు.కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ప్పుడు మనకు కూడా కేంద్రం చచ్చినట్లు చేయాల్సిందేని, చేయపోతే ఎంత దూరమైన యుద్ధం చేస్తామన్నారు. దేశం సురక్షితంగా, జాగ్రత్తగా ఉండా లంటే రిజర్వేషన్‌లకు సంబంధించిన అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.