ప్రధానితో భేటీకానున్న కెసిఆర్

Telangana CM KCR meeting with PM Modi with various issues

Telangana CM KCR meeting with PM Modi with various issues

తెలంగాణా రాష్ట్రంలో బీసీ-ఈ గ్రూపు రిజర్వేషన్ల పెంపు బిల్లు, వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తింపు, అసెంబ్లీ సీట్ల పెంపు, రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక అంశాలను పరిష్కరించడానికి కేంద్రం నుండి సహాయం కోరుతూ ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానితో భేటీ కానున్నారు.

ముఖ్యంగా ఈమధ్య తెలంగాణా అసెంబ్లీ ఆమోదం తెలిపిన రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ప్రధానితో చర్చించనున్నారు. ఉదయం 11:45గంటలకు జరుగనున్న ఈ భేటీలో ఈ అంశాలతో పాటు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలువంటి వాటిని ప్రధాని దృష్టికి తేనున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్.

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం నీతి ఆయోగ్ సమావేశంలో వ్యవసాయరంగంపై తన విజన్‌పై ప్రసంగించిన కెసిఆర్ ఈ రోజు రాష్ట్ర విభజన చట్టం అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తున్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు విషయమై ఏర్పడ్డ చిక్కులకు వీలైనంత తొందరగా పరిష్కారం చూపాలని కోరనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.