ట్యాంక్‌బండ్‌పై సినారె కాంస్య విగ్రహం : నివాళులర్పించిన కేసీఆర్

Telangana CM KCR paid homage to legendary poet C Narayana Reddy

తెలుగు ప్రజలు గొప్పగా చెప్పుకునే వ్యక్తి, మహాకవి, గొప్ప సాహితీవేత్త డాక్టర్ సి. నారాయణరెడ్డి విగ్రహన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టిస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూసిన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. సినారె ఇంటికి చేరుకున్న కేసీఆర్‌ ఆయన పార్థివదేహానికి పుష్ఫాంజలి ఘటించారు. అనంతరం సినారె గదిని పరిశీలించారు.

Telangana CM KCR paid homage to legendary poet C Narayana Reddy

సినారె  సేవలు చిరస్థాయిలో గుర్తుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంత కీర్తించుకున్నా, పొగిడినా ఆయన సేవలు మరువలేనివి అని స్పష్టం చేశారు. కవులకు గ్లామర్‌ తెచ్చిన మహానుభావుడు సినారె అని తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఆయనేనని అన్నారు. అంతేగాక ఆది, అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పిన మహాకవి సాహిత్య రంగానికి అందించిన సేవలు మరువలేనివన్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు పూర్వపు కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల, హనుమాజీపేటలో సినారె కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పారు.

Telangana CM KCR paid homage to legendary poet C Narayana Reddy

సినారె అభిమానించిన సారసత్వ పరిషత్‌కు ప్రభుత్వం అండదండలు అందిస్తుందన్నారు. సినారె అంత్యక్రియల్లో కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సినారె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చేవారి కోసం జిల్లా కేంద్రాల నుంచి 100 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కేసీఆర్. అంతేగాక నగరం నడిబొడ్డున సినారె స్మారక మ్యూజియం, సాహితీ సమావేశ మందిరం ఏర్పాటు చేస్తామని, తెలంగాణలోని ఓ ప్రముఖ సంస్థకు లేదా ఓ యూనివర్సిటీకి సినారె పేరు పెడుతామని చెప్పారు కేసీఆర్.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.