చంద్రబాబుని కలిసిన ఈటెల

telangana-finance-minister-eetala-rajender-met-ap-cm-chandra-babu

telangana-finance-minister-eetala-rajender-met-ap-cm-chandra-babu

తెలంగాణా ఆర్థికశాఖామంత్రి ఈటల రాజేందర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసారు. ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబునాయుడు అనంతపురం వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబును కలిసేందుకు టీఎస్ మంత్రి ఈటల హైదరాబాద్ నుంచి అమరావతికి వెళుతూ గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగారు. దీంతో ఇద్దరి కలయికకు గన్నవరం ఎయిర్ పోర్టు వేదికైంది.

విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏరువాక కార్యక్రమానికి బయలుదేరుతున్న చంద్రబాబుని కలిసిన ఈటెల ఈనెల 18వతేదీన జరిగే తన కుమారుడి వివాహానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఇప్పటికే పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్న ఈటల వివాహపత్రికలను స్వయంగా ఒక్కరొక్కరి దగ్గరి వెళ్ళి వారిని ఆహ్వానిస్తున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.