రేపే తెలంగాణా ఇంటర్ ఫలితాలు

Telangana Intermediate exam 2017 Results to be declared tomorrow at 10am

Telangana Intermediate exam 2017 Results to be declared tomorrow at 10am

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా…. అనుకున్న సమయం కంటే ముందే ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇంటర్ ఫలితాలను ఆదివారం (16వ తేదీనే) విడుదల చేయాలని డిసైడ్ చేశారు. ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈయేడాది మార్చి 1న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలను నిర్వహించే జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) సమావేశంలో ఏప్రిల్‌ 20-22 తేదీల మధ్యన ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్‌ బోర్డు హామీ ఇచ్చింది. అయితే ఏపీలో ఇంటర్‌ ఫలితాలు వెల్లడి కావడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో ముందుగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.