నోకియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరిన కేటీఆర్

ktr-meets-with-nokia-and-ericsson-company-delegates-in-usa

ktr-meets-with-nokia-and-ericsson-company-delegates-in-usa

తెలంగాణాలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్ళిన తెలంగాణా ఐటీశాఖామంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీలోని సాంటాక్లారాలో ఎరిక్సన్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పరిశీలించారు.  ఆ తర్వాత నోకియా, ఎరిక్సన్ కంపెనీలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని, డేటా అనలటిక్స్ పార్కులో నోకియా మొబైల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కంపెనీల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు. ఫైబర్‌గ్రిడ్ కార్యక్రమంపై ఆసక్తి కనబరిచిన నోకియా ప్రతినిధులు..ఫైబర్ గ్రిడ్ కోసం జారీచేయబోయే ఆర్‌ఎఫ్‌పీలో పాల్గొంటామని కేటీఆర్‌కు తెలిపారు.

ktr-meets-with-nokia-and-ericsson-company-delegates-in-usa1

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.