డబ్బులడిగితే చెప్పుతో కొట్టండి: కెటిఆర్

Telangana MInister KTR Sensational comments on Double Bedroom scheme in MahabubNagar

Telangana MInister KTR Sensational comments on Double Bedroom scheme in MahabubNagar

ఎప్పుడూ కూల్‌గా ఉంటూ తన పని తాను చేసుకుపోయే తెలంగాణా మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణ పనుేల పరిశీలను వెళ్ళిన కెటిఆర్ డబుల్‌బెడ్ రూం ఇళ్ళ కోసం దళారులను నమ్మొద్దని సూచించారు. అంతేగాక బ్రోకర్లు ఎవరైనా డబ్బులిస్తే ఇళ్ళిప్పిస్తామని లంచం అడిగితే చెప్పుతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో పర్యటించిన కెటిఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2లక్షల70వేల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పిన కెటిఆర్, ఒక్కో ఇంటికి రూ. 6 లక్షలను వెచ్చిస్తున్నామని తెలిపారు. అంతేగాక పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఈ పథకం విషయంలో ఎలాంటి అవకతవకలకు ప్రోత్సాహం ఇవ్వకూడదని సూచించారు.

ఇలాంటి మంచి కార్యక్రమంపైనా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. 33 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు తెలంగాణా మంత్రి కెటిఆర్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.