నాలుగు వారాల క్రితమే కలిసిన కెటిఆర్ – పవన్‌కళ్యాణ్

Telangana Minister KTR watched Katamarayudu and congratulated Pawan Kalyan

 

Telangana Minister KTR watched Katamarayudu and congratulated Pawan Kalyan

 

సాధారణంగా ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే నాయకులు, మంత్రులు కాస్త రిలీఫ్ అవ్వడం కోసం సినిమాలు, షికార్లకు వెళ్ళడం కామన్. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ సినిమా చూసారనేది బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే లేటెస్ట్‌గా తెలంగాణా ఐటీశాఖా మంత్రి కెటిఆర్ పవన్ కళ్యాణ్‌ లేటెస్ట్ మూవీ కాటమరాయుడుని పీకెతో కలిసి చూసారు. అంతేకాకుండా సినిమా అయిపోయిన తర్వాత కాటమరాయుడిని మెచ్చుకుంటూ ట్విట్టర్‌లో పవన్‌తో సెల్పీ దిగి పోస్ట్ చెయ్యడమే కాకుండా ‘కాటమరాయుడు’ ను అభినందనలతో ముంచెత్తారు.

సినిమా చాలా బాగుందని, పవన్ కళ్యాణ్, శరత్ మారార్లకు మంచి విజయం దక్కుతుందని కెటిఆర్ పోస్ట్ చేశారు. అంతేగాక చేనేత వస్త్రాలకు సంబంధించి ప్రమోషన్లు చేయించడంలో  ముందుంటున్న కెటిఆర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకు చాలా మంచి ప్రమోషన్లు చేశారని మెచ్చుకున్నారు.

Pawan Kalyan Tweet on KTR

ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌సైతం ట్విట్టర్‌లో కాటమరాయుడు సినిమా చూసినందకు కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలియచేశారు. అంతేగాక నాలుగు వారాల క్రితం డిన్నర్ కోసం తామిద్దరం కలిసామని, రాజకీయాలు , చేనేత రంగంపై తమ ఇద్దరి ఆలోచనలను పంచుకున్నామని తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.