కోర్టుకు హాజరైన తెలంగాణా మంత్రులు

Telangana Ministers KTR Nayini PadmaRao were presented at Court Trail

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనడానికి నిదర్శనం ఇది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన టిఆర్ఎస్ నాయకులు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వంలో మంత్రులుగా కీలక శాఖలు చూస్తున్నారు. అయితే అప్పుడు నిరసనకారులుగా, ఉద్యమనేతలుగా చేసిన పనులు ఇప్పటికీ వాళ్ళ వెంట పడుతూనే ఉన్నాయి.

Telangana Ministers KTR Nayini PadmaRao were presented at Court Trail

రాష్ట్ర ప్రభుత్వంలో బిజీ బిజీగా ఉండే మంత్రులు గతంలో చేసిన పనులకు ఇప్పటికీ తమ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. తెలంగాణా ఉద్యమ సమయంలో రైల్‌రోకో సందర్భంగా నమోదైన కేసులో విచారణ కోసం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ మున్సిపల్‌శాఖామంత్రి కెటిఆర్, ఎక్సైజ్,క్రీడలశాఖామంత్రి పద్మారావులు ఈరోజు రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

See Also: మీడియాపై కెటిఆర్ గరం – తెలంగాణా ఇమేజ్‌ను దెబ్బతీయకండి

అయితే ఇప్పటికే తెలంగాణా ఉద్యమ సమయంలో ఉద్యమకారులు, నిరసనకారులపై ఉన్న అన్ని కేసులను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇది చూసైనా కేంద్రప్రభుత్వం ఉద్యమ కేసులు ఇప్పటికైనా ఎత్తివేయదా? అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.