పోలీసుల్లో గులాబీ భక్తి: బోనాల్లో కేంద్రమంత్రికి అవమానం

Telangana Police insults Central Minister Dattatreya at Mahankali Bonalu

రూల్ అంటే ఎవరికైనా ఒకే రకంగా ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకరకమైన గౌరవం, మిగతా వాళ్ళకి మరొక రకమైన అగౌరవం ఇవ్వడంలో మన అధికారులు పీహెచ్‌డీలే చేసేశారు. ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని పక్కనబెట్టి రాష్ట్రమంత్రులు, ఒక ఎంపీకి సాగిలపడి దండాలు పెట్టడం మన పోలీసులకే చెల్లుతుంది. ఆయన ఒక కేంద్రమంత్రి మాత్రమే, ఆ ఎంపీ ముఖ్యమంత్రి కూతురు అని గుర్తొచ్చినట్లుంది తెలంగాణా పోలీసులకు. అందుకే సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరలో దర్శనానికి వచ్చిన  కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను తెలంగాణా పోలీసులు అవమానించి పంపించారు.

Telangana Police insults Central Minister Dattatreya at Mahankali Bonalu

అట్టహాసంగా జరుగుతున్న మహంకాళి బోనాల జాతరలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లిన కేంద్రమంత్రి దత్తాత్రేయ వాహనాన్ని పోలీసులు ఆలయం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సికింద్రబాద్ ప్రధాన రహదారిలో రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పాత భవనం వద్దే ఆపేసి రద్దీ ఉందంటూ అక్కడే ఆపాలని ఓ పోలీస్‌ అధికారి స్పష్టం చేశారు.

See Also: కేసీఆర్‌పై ధ్వజమెత్తిన కమలనాథులు

అయితే 9గంటల20నిమిషాలకు విమానంలో తిరుపతి వెళ్లే పని ఉందని, వాహనంలో ఉన్న దత్తాత్రేయ భార్య నడవలేకపోతున్నారని మంత్రి అనుచరులు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా, దిగి నడిచి వెళ్లాలని కేంద్రమంత్రికే సూచించారు. పోలీసులు వాహనాన్ని ముందుకు పంపిచమని స్పష్టం చేయడంతో దత్తాత్రేయ ఏమి మాట్లాడకుండా వాహనం దిగి కుటుంబసభ్యులతో ఆలయం వద్దకు నడిచివెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడూ ఆయన బయట కొంతసేపు వేచి చూసినా పోలీసులు స్పందించకపోవడంతో నడుచుకుంటూనే తిరిగి వెళ్లిపోయారు.

అయితే కేంద్రమంత్రి వాహనాన్ని ఆపేని ఆయనతో పాదయాత్ర చేయించిన తెలంగాణా పోలీసులు ఆ తర్వాత దర్శనానికి వచ్చిన ఎంపీ కవిత, రాష్ట్ర మంత్రులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డితో పాటు కొందరు కిందిస్థాయి నాయకుల వాహనాలను మాత్రం రాజమార్గం ద్వారా ఆలయం వద్దకు అనుమతించారు. కేంద్రమంత్రిని అందునా ఆయన వయసుకు కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నిబంధనల ప్రకారం అడ్డుకున్నప్పుడు, ముఖ్యమంత్రి కుమార్తె వచ్చినప్పుడు, రాష్ట్రమంత్రులు, ఆఖరికి కొంతమంది గల్లీ లీడర్ల వాహనాలను దేవాలయం వరకు అనుమతించి తమ రాజభక్తిని చాటుకున్నారు.

See Also: బంగారు తెలంగాణా ఎంతవరకు వచ్చింది ?

Have something to add? Share it in the comments

Your email address will not be published.