దిల్ రాజ్ కు సతీ వియోగం

(పాత చిత్రం)

ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజ్ కి సతీ వియోగం జరిగింది. దిల్ రాజ్ సతీమణి అనిత (46) శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దిల్ రాజ్ ప్రస్తుతం అమెరికాలో ఫిదా సినిమా షూటింగ్ లో ఉన్నారు.

ఇన్నాళ్లు దిల్ రాజుగారి ప్రయాణంలో అడుగడునా ఆయనకు సపోర్ట్ చేస్తూ, ఆయన ఉన్నతికి తన వంతు భాద్యత నిర్వహించిన ఆమె మరణం ప్రతి ఒక్కర్ని కలచివేస్తోంది. పరిశ్రమలోని ఎంతోమంది నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణలకు అనేక విధాలుగా సహాయపడే మంచి మనిషి దిల్ రాజుగారికి, ఆయన కుటుంబానికి సకలం ప్రగాఢమైన సానుభూతి తెలియచేస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.