హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరో శ్రీరాజ్

Telugu Hero Sri Raj roped into a Hollywood movie directed by Bret Ratner

భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రంలో హీరోగా నటించిన యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ రాజ్ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. హాలీవుడ్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపించే బంపర్ ఆఫర్ సంపాదించగలిగాడు.

Telugu Hero Sri Raj roped into a Hollywood movie directed by Bret Ratner

స్టార్ డైరెక్టర్ మారుతి టీం వర్క్స్ భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో శ్రీ రాజ్ కు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తన నటన మరింత రాటు దేలేలా శిక్షణ పొందాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అయ్యాడు. రష్ హవర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని రూపొందించిన హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బ్రెట్ రాట్నర్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న చిత్రంలోనే శ్రీ రాజ్ నటించే అవకాశం సంపాదించాడు.

న్యూయార్క్ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుంది. దీంతో పాటు తెలుగులో పెద్ద చిత్రాలు నిర్మించే రెండు బ్యానర్స్ రూపొందించే చిత్రాల్లోనూ శ్రీరాజ్ హీరోగా నటించబోతున్నాడు.

See Also: 15మంది నటీనటులపై అల్లు అరవింద్ సీరియస్

హీరో శ్రీరాజ్ మాట్లాడుతూ…. నటన అంటే నాకు ప్రాణం. విభిన్నమైన పాత్రలు చేయాలనేది నా కోరిక. అందుకోసేమే ఇంజినీరింగ్ పూర్తి కాగానే… అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ కోర్స్ చేశాను. రష్ హవర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన బ్రెట్ రాట్నర్ ఆధ్వర్యంలో సినిమా రూపొందిస్తుండండం చాలా హ్యాపీ.

స్కైలైన్ న్యూయార్క్ పిఆర్ టీం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కించే ఈ చిత్రంలో నేను టాక్సీ డ్రైవర్ గా లీడ్ క్యారెక్టర్లో నటిస్తున్నాను. రెండు జంటల మధ్య నడిపే ప్రేమ కథా చిత్రమిది. న్యూయార్క్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ. ఇంగ్లిష్ తో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

దీంతో పాటు… తెలుగులో భారీ చిత్రాలు నిర్మించే రెండు బ్యానర్స్ రూపొందించబోయే రెండు సినిమాల్లో హీరోగా నటించబోతున్నాను. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. ఛాలెంజింగ్ ఉండే క్యారెక్టర్స్ చేయాలనేది నా గోల్. అని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.