షాలిని టీజర్, లోగో లాంచ్

 

స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లయన్ సాయి వెంకట్ సమర్పణలో వస్తున్న మరో హర్రర్ థ్రిల్లర్ “షాలిని”. ఈ సినిమాకి సంబధించి లోగోను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ లాంచ్ చేయగా టీజర్స్ ను సెన్సార్ బోర్డు సభ్యుడు రామకృష్ణ, నాగబాల సురేష్ కుమార్లు రిలీజ్ చేశారు. సినిమా పోస్టర్ ను లయన్ సాయి వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లయన్ సాయి వెంకట్ మాట్లడుతూ.. “త్వరలో రానున్న మా “పిశాచి-2” సినిమా పబ్లిసిటీలో బిజీగా ఉండగా ఈ సినిమా దర్శకుడు షెరాజ్ నన్ను కలిసి మా “షాలిని” సినిమా కూడా మీ సహకారం కావాలని అడిగాడు. సినిమా చూసి షెరాజ్ చాలా బాగా తీసాడనిపించింది. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధమవుతుంది. ఇదో మంచి హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా రిలీజ్ తరువాత షెరాజ్ తో కరెప్షన్ మీద భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నాను” అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “హారర్ సినిమాలను ఆదరిస్తున్న ఈ రోజుల్లో “షాలిని” కూడా మంచి హిట్ సాధిస్తుంది. చిన్న సినిమాగా వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు. చిత్ర నిర్మాత పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. “నాకు కృష్ణ గారంటే చాలా అభిమానం. ఆయన స్ఫూర్తితోనే నిర్మాతగా మారాను. మాకు అన్ని విధాలా సహకరిస్తున్న సాయి వెంకట్ గారికి కృతఙ్ఞతలు” అన్నారు. దర్శకుడు షెరాజ్ మాట్లడుతూ.. “దెయ్యానికి ఒక రూపం ఉండదని చెప్పే చిత్రమే మా “షాలిని”. చిన్న సినిమాలకు పడే కష్టం పెద్ద సినిమాలకు ఉండదు. కష్టపడి ఈ సినిమాను తీసాం. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.