ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: తలలు పగిలాయి. కుర్చీలు విరిగి పడ్డాయి. లాఠీలు విరిగాయి. ధర్నాచౌక్ యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. అఖిలపక్ష నేతలు, స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ధర్నాచౌకు తరలించవద్దంటూ అఖిలపక్షం, తరలించాల్సిందే అంటూ స్థానికులు పోటీపోటీగా నిరసనలకు దిగారు. ఇరువర్గాల మధ్య వివాదం ముదిరి గొడవకు దారితీసింది. కుర్చీలతో కొట్టుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. లాఠీఛార్జీ చేసారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ధర్నాచౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.

ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ టీజేఏసీ చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే ధర్నాచౌక్‌ తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు చేపట్టిన ఆందోళనకూ పోలీసులు అనుమతినిచ్చారు. పరస్పర ఆందోళనలతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు కర్రలు, జెండాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో స్థానికులకు పలువురు వాకర్స్ కు గాయాలయ్యాయి. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్‌ రణరంగాన్ని తలపిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.