ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి-ఇద్దరు జవాన్లు మృతి

terror-attack-on-army-convoy-in-between-jammu-srinagar-near-qazigund

terror-attack-on-army-convoy-in-between-jammu-srinagar-near-qazigund

కశ్మీర్‌లో కల్లోల వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత సైన్యాన్నే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు మరోసారి విరుచుకపడ్డారు. అటు కృష్ణఘటి సెక్టార్‌లోని సరిహద్దు వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అప్రమత్తమైన భారత బలగాలు.. పాక్‌కు గట్టి జవాబు ఇచ్చారు. ఇది జరిగిన కొద్దిసేపటికే జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిలోని కుల్గామ్‌ సమీపంలో ఖ్వాజీగండ్ ప్రాంతంలో  ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు.

కుల్గామ్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారని, మన సైనికులు కూడా ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారని ఆర్మీ వర్గాలు తెలియచేశాయి. అయితే ఉగ్రవాదులకు ఆర్మీకి మధ్య దాడులు ఇంకా కొనసాగుతున్నప్పటకీ ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ ఆరుగురు జవాన్లలో ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటికే ఇద్దరు జవాన్లు మృతిచెందారు.

ఈ ఉగ్రదాడి ఘటనతో అప్రమత్తమైన పారామిలటరీ బలగాలు ఉగ్రవాదుల కోసం ఖ్వాజీగండ్ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండడంతో జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసేసారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.