చేనేతకు సమంతనే తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్

Tesco will make an agreement with samantha for handloom movement in Telanagana says Sailaja Ramayyar

Tesco will make an agreement with samantha for handloom movement in Telanagana says Sailaja Ramayyar

తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న టెస్కో తరపున చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటీ సమంత సేవలను వినియోగించుకోనున్నట్లు టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్ తెలిపారు.

సమాచార సమన్వయ లోప కారణంగా జరిగిన సినీ నటి సమంతా చేనేత బ్రాండ్ అంబాసిండర్ కాదంటూ వచ్చిన వార్తలపైన డైరెక్టర్ స్పందించారు. స్వఛ్చందంగా చేనేత కోసం ముందుకు వచ్చిన సమంతా సేవలను వాడుకోనున్నట్లు ఆమె తెలిపారు.

సుమారు నెల రోజుల క్రితం చేనేత రంగ అభివృద్ది, చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం తీసుకుని వచ్చేందుకు సమంతా ముందుకు రావడాన్ని, కెటిఆర్ తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తించి, గౌరవించారు. ముఖ్యంగా తనకు చేనేత వస్త్ర ఉత్పత్తుల పట్ల ఉన్న మక్కువ, ఆసక్తి వలన స్వచ్చందంగా టేస్కోతో కలిసి పని చేస్తానన్న సమంతను తాము చేనేత బ్రాండ్ అంబాసిండర్ గా గుర్తించనున్నట్లు తెలిపారు.

టెస్కో చేనేత ఉత్పత్తులకు విశిష్ట ప్రాచుర్యాన్ని మరియు అమ్మకాలను ప్రోత్సహించడానికి అమె ప్రతిఫలరహితంగా సేవలు అందిస్తున్నారని డైరెక్టర్ శైలజా రామయ్యర్ తెలియ జేశారు. ఈ మేరకు తెలంగాణలోని పలు చేనేత వస్త్ర తయారీ ప్రాంతాలను సందర్శించి, పరిస్ధితులపైన అధ్యాయనం చేశారన్నారు.

ఈ మేరకు చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం తెచ్చేందుకు, డిజైనింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో తనకున్న అలోచనలు అమె తమతో పంచుకున్నారని, తర్వలోనే అధికారికంగా సమంతాతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ఆమె తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.