శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన జాత్యంహకార దాడిలో హత్యకు గురైన హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. శ్రీనివాస్‌ మృతదేహాన్ని మల్లంపేటలోని ఆయన స్వగృహం నుంచి ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. భారీసంఖ్యలో బంధువులు, స్నేహితులు అక్కడికి తరలివచ్చారు. అనంతరం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

కూచిభొట్ల శ్రీనివాస్‌ మృతదేహం సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు, విషాదవదనంతో విలపించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు వర్థిని, మధుసూదనరావు భార్య సునయన బోరున విలపించి కుప్పకూలిపోయారు.

ఈరోజు ఉదయం నుంచి శ్రీనివాస్‌ను కడసారి చూసేందుకు పెద్దఎత్తున బంధువులు, స్నేహితులు, స్థానికులు ఆయన నివాసానికి పోటెత్తారు. పలువురు రాజకీయ నేతలు కూడా శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసి నివాళలర్పించారు. అనంతరం శ్రీనివాస్‌ మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.