కోదండరాం అరెస్ట్

TJAC Chairman Kodandaram arrested by Siddipet police

కొండపోచమ్మ రిజర్వాయర్ భూ నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్లిన టీజేఏసీ చైర్మన్ ప్రో.కోదండరాంకు ఇబ్బందులు తప్పట్లేదు. సిద్ధిపేట జిల్లా మర్కూక్‌ మండలంలో నిర్మిస్తున్న కొండపోచమ్మ జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ పరామర్శించారు.

TJAC Chairman Kodandaram arrested by Siddipet police

అనంతరం ములుగు మండలం బైలంపూర్‌లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమైన కోదండరామ్‌ బాధిత రైతులను పరామర్శించే క్రమంలో ఓ రైతు ఇంట్లోకి వెళ్లారు.

See Also: ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగద్దు: కేసీఆర్

బైలంపూర్ గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడి టీ తాగుతున్న ప్రొ. కోదండరాంను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుపడ్డారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టేసి కోదండరామ్‌తో పాటు హైకోర్టు న్యాయవాది రచనారెడ్డిని వాహనంలో ఎక్కించి బలవంతంగా గజ్వెల్ వద్ద బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయితే ప్రభుత్వ నిర్బంధ వైఖరికి నిరసనగా పోలీస్ స్టేషన్‌లొనే టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం నిరాహార దీక్షను ప్రారంభించారు. కోదండరాంను తక్షణం విడుదల చేయాలని టీజేఏసీ డిమాండ్ చేస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.