ఫీజుల నియంత్రణకై పోరాటం-టీజాక్ తీర్మానం

TJAC resolves to fight against fees hike

హైదరాబాద్: రాజకీయాల అర్ధం మారాలని, ప్రభుత్వాధికారం సమష్టి వ్యవహారం కావాలని, అవినీతి అంతంకావాలని తెంగాణ సంయుక్త కార్యాచరణ సంఘం (టీజేఏసీ) ఆదివారం నాడు తీర్మానించింది. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించగలగాలని, ప్రజలు కేంద్రంగా అభివృద్ధిని సాధించాలంటే ప్రజా ప్రతినిధులు ప్రజలపట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ టీజేఏసీ తీర్మానించి. హైదరాబాద్ కర్మన్ ఘాట్, మెగా పంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ విస్తృత స్ధాయి స్టీరింగ్ కమిటి సమావేశంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తూ పలు తీర్మానాలు చేసింది.

ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపడాన్ని రాజ్యాంగం ప్రాధమిక హక్కుగా గుర్తించింది. టీఆర్ఎస్ కూడా తన ఎన్నికల మానిఫెస్టోలో ఈ అంశం పొందుపరిచింది. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలకు ఉన్నదని మరచిపోయి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని, నిరుద్యోగ నిరసన ర్యాలీ పట్ల ప్రభుత్వం అనుసరించిన రాజ్యాంగ వ్యతిరేక పంధాను జేఏసీ సమావేశం తీవ్రంగా ఖండించింది.

కార్యాచరణ:

  • కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ కోసం, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం, కేజి టు పీజీ ఉచిత విద్యను డిమాండుచేస్తూ ఏప్రిల్ లో జిల్లాలలో సదస్సులు, ధర్నాలు.
  • నేటి తెలంగాణలో “నీళ్లు, నిధులు, నియామకాలు-నిజాలు“పై మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, రౌండ్ టేబులో మీటింగులు.
  • మే, 2017 నాటికి జేఏసీ గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు,
  • బతుకు తెలంగాణ సాధనకై “జయశంకర్ స్పూర్తి యాత్ర“, జూన్ 21 నుండి

తీర్మానాలకు క్లిక్ చేయండి

Have something to add? Share it in the comments

Your email address will not be published.