చిన్నమ్మను ఔట్… సత్యమూర్తి ఇన్…

TN intelligence chief Sathiyamurthy has been replaced by davidson after political drama

TN intelligence chief Sathiyamurthy has been replaced by davidson after political drama

తమిళనాడు రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయో అంతేగ వేగంగా గతంలో తీసుకున్న నిర్ణయాలు సైతం మారిపోతున్నాయి. రెండు నెలల క్రితం రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉండేందుకు వీల్లేదంటూ బయటికి పంపిచేసిన ఐపీఎస్ అధికారి కెఎన్ సత్యమూర్తిని తిరిగి అదే పోస్టులో నియమించింది పళనిస్వామి ప్రభుత్వం.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ మీద మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు ప్రకటించిన సమయంలో సత్యమూర్తిని ఇంటెలిజెన్స్ చీఫ్‌ పదవి నుండి పక్కనబెట్టింది. దీంతో ఫిబ్రవరి 12న సత్యమూర్తిని తప్పనిసరిగా వేచి ఉండాలంటూ బదిలీ చేశారు.

గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శశికళ, దినకరన్‌లను పార్టీ నుండి బయటికి పంపించడానికి రంగం సిద్ధం చేసిన వెంటనే మళ్లీ ఇంటెలిజెన్స్ ఐజీగా సత్యమూర్తిని నియమిస్తున్నట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నిరంజన్ మర్దీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుండి సత్యమూర్తిని తప్పించినప్పుడు.. ఆయన స్థానంలో ఎస్. డేవిడ్‌సన్‌ దేవసిర్వతంను నియమించారు. అయితే, పది రోజుల్లోనే ఆయన్ను మళ్లీ వెనక్కి పంపారు. 2015 డిసెంబర్ నాటికి డేవిడ్‌సన్ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండేవారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఆయన్ను తప్పించి ఆయన స్థానంలో సత్యమూర్తిని నియమించింది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.