సెక్రటేరియట్‌లో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ

TNGos and Secretariat employees arguments turns into fight in Hyderabad

పోరాడి తెలంగాణా సాధించుకున్న తర్వాత కూడా అంతర్గత విబేధాలతో తెలంగాణా ఉద్యోగులు కొట్టుకొనే స్థాయికి చేరుకున్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో అందరూ కలిసికట్టుగా పోరాడినప్పటికీ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు దాటడంతో ఒకరంటే ఒకరికి పడకపోవడంతో చేతులకు పని చెప్పుతున్నారు.

TNGos and Secretariat employees arguments turns into fight in Hyderabad

File Photo

తెలంగాణా సచివాలయం సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు కొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. రెండు వర్గాలవారు గల్లాలు పట్టుకొని కొట్టుకొనే సమయంలో మీడియా అక్కడికి వెళ్ళడంతో పరువు తీసుకోకుండా అక్కడినుండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు జరిగిందేంటంటే… ఆరు నెలల క్రితం 24 మంది ఏపీ స్థానికత ఉన్న సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. కానీ వారిని ఏపీ ప్రభుత్వం అక్కడ చేర్చుకోలేదు. దీంతో వారంతా తిరిగి తెలంగాణకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు.  వారికి తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్ రావు మద్దతు ఉందని టిఎన్జీఓలు ఆరోపిస్తున్నారు.

See Also: ఇదేం పైత్యం కమలనాథా…??

ఏపీ సెక్షన్ ఆఫీసర్ల తరలింపు విషయంలో సెక్రటేరియట్ డీ బ్లాక్ లో టీఎన్జీవోలు సమావేశమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సచివాలయ ఉద్యోగులు తమకు తెలియకుండా సచివాలయంలో ఎలా సమావేశమవుతారంటూ టీఎన్జీవోల మీటింగ్ ను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య  తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నరేందర్ రావు ప్రోద్భలంతోనే ఏపీ అధికారులు దొడ్డి దారిలో తిరిగి తెలంగాణ సచివాలయంలో చేరేందుకు పావులు కదుపుతున్నారని టిఎన్జీఓలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అందుకే తమ మీటింగ్ ను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నారని వారు అంటున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.