ఆగస్టులో మహాయుద్ధం: గెలుపెవరిది??

Tollywood war for Long Weekend in August

వరుస హాలిడేస్‌ని టార్టెట్ చేసుకొని సినిమా షూటింగ్‌లు పూర్తి చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటాయి సినిమా టీంలు. అయితే ఈయేడాది ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం ముందు వచ్చే శుక్రవారం రోజు సినిమాను రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ఉంటాయని అందరూ అనుకుంటారు. అందుకే ఆగస్టు 11న సినిమాను విడుదల చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధపడుతున్నారు కొందరు హీరోలు.

Tollywood war for Long Weekend in August as 4 Movies on August 11th

ఎండాకాలం సెలవుల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాల్లో దాదాపు అన్నీ బాక్సాఫీస్‌ను షేక్ చేయకుండా హిట్‌లు కొట్టినవే. అయితే ఆగస్టు15కు ముందు వస్తున్న లాంగ్ వీకెండ్‌ను ద‌ృష్టిలో పెట్టుకొని సినిమాలు విడుదలకు రంగం సిద్ధమౌతోంది. ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలని అందరికంటే ముందే తమ రాకను అనౌన్స్ చేసేశాడు హీరో నితిన్. హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో హీరో అర్జున్ స్పెషల్ పాత్రలో లవ్ ఇంటలిజెన్స్ ఎన్మిటీ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లై’. ఈ సినిమాలో నటిస్తున్న నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆగస్ట్ 11న వస్తున్నానని ముందుగానే కర్చీఫ్ వేసేసుకున్నాడు.

మరోవైపు పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాను సైతం ఆగస్టు 11ననే రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు తేజ డైరెక్షన్‌లో దగ్గుబాటి రానా, కాజల్ అగర్వాల్, క్యాథరిన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తూ గంపెడాశలు పెట్టుకున్న ఈ సినిమా టీజర్‌తో ఇప్పటికే అంచనాలు పెంచేసింది. బాహుబలి 2 తర్వాత జోగేంద్ర అనే క్యారెక్టర్‌తో తనలోని నటనను బయటపెట్టి మార్కులు కొట్టేయాలని భారీ ఆశలతో ఉన్నాడు రానా.

బోయపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జయ జానకి నాయక’. కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకోవడానికి వస్తున్న ఈ సినిమా కూడా ఆగస్ట్ 11న రిలీజ్‌కు సిద్ధమైంది. బోయపాటి స్టైల్లో పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉందంటూ పోటీలో నిలబడ్డారు బోయపాటి, బెల్లంకొండ.

మంచి సినిమాలను అందించిన వారాహి చలన చిత్రం బ్యానర్లో నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా యుద్ధం శరణం. క‌ృష్ణ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లవర్ బాయ్ ఇమేజ్ నుండి చైతూని కొత్త ఇమేజ్‌లో చూపించబోతున్నారని టాక్. ఈ సినిమాకి సంబంధించి ఆగస్టు 11న విడుదల అని తేదీ ఖరారు చేయకపోయినప్పటికీ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుండడంతో ఈ సినిమా  ఆగస్ట్ 11నే థియేటర్స్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది.

దీంతో ఆగస్ట్ 11న టాలీవుడ్ బాక్సాఫీస్‌ పోటీలో ఎవరు నిలబడుతారు… ఆ సమయానికల్లా ఎవరైనా పోస్ట్‌పోన్ చేసుకుంటారా అనే అనుమానాలు అయితే వ్యక్తమౌతున్నాయి.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.