హీరోయిన్లకు ఐటం సాంగ్స్ ఎందుకంత ఇష్టమంటే???

Top Heroines are more interested in doing Item songs in Telugu

Top Heroines are more interested in doing Item songs in Telugu

హీరోయిన్స్ ఐటం సాంగ్స్ కు రెడీ అయిపోతున్నారు. అదివరకు ఐటం సాంగ్ చేయడానికి ససేమిరా అనేవారు. ఇప్పుడు అలా కాదు .. ..రోజుకో హీరోయిన్  ఐటం సాంగ్ చేయడానికి ముందుకొస్తోంది. హీరోయిన్స్ మధ్య కాంపిటీషన్ పెరగడంతో… రేసులో తామెక్కడ వెనకబడుతామోనన్న భయంతో ఐటం సాంగ్ చేయడానికైనా సిద్ధపడుతున్నారు. పైగా ఇంకో అడ్వాంటేజ్  ఏంటంటే  రెండు మూడు రోజులు చేసి లక్షలు తీసుకోవచ్చు. అందుకే చాలామంది ముద్దుగుమ్మలు  హీరోయిన్  ఛాన్స్ కోసం ఎదురు చూడకుండా  ఐటం చేయడానికి రెడీ అయిపోతున్నారు.

హీరోయిన్ గా చేయడం ఎందుకు దండగ, ఐటం చేస్కుంటే చాలు అదే పండగ అనుకుంటున్నారు ఇప్పటి హీరోయిన్స్. అదీగాక హీరోయిన్ గా చేస్తే సినిమా పూర్తయ్యేదాకా  కష్టపడి చేయాలి. చాలా రోజులు పడుతుంది. ఐటం అయితే – తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు. అందుకే  ఐటం సాంగ్  అయినా దక్కించు కుందామని కొందరు హీరోయిన్స్ తెగ ట్రై చేస్తున్నారు.

బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా  ఒకప్పుడు  ఐటమ్స్ చేయడానికి సెపరేట్ గా నటీమణులు ఉండేవారు. వాళ్లను క్లబ్ డాన్సర్స్ అనేవారు. హీరోయిన్స్  అలాంటి డాన్సులు చేయడానికి  ఒప్పుకునేవారు కారు. తమ ఇమేజ్ డామేజ్ అవుతుందని భయపడేవారు.  ఇప్పుడు అలా కాదు –ఇమేజ్ కోసం చూడ్డం లేదు. మనీకోసం చూస్తున్నారు.

బాలీవుడ్ లో హీరోయిన్స్  ఐటం సాంగ్స్ చేయడం కత్రినా కైఫ్ తో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. తర్వాత ముమైత్ ఖాన్, మలైకా అరోరా  ఆ ట్రెండ్ ను పికప్ చేసుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు శ్రియ, సమంత, ఛార్మి, కాజల్, తమన్నా, అంజలి వంటివారు ఐటమ్స్ సాంగ్స్ చేశారు. కొత్తగా  రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా కూడా ఐటమ్ కోసం రెడీ అయిపోయారు. ఇక ఖైదీ నంబర్ 150 లో అయితే లక్ష్మీరాయ్ ని స్పెషల్ గా ఐటంకోసం తీసుకున్నారు.

సినిమాల్లో ఐటం సాంగ్స్ కి డిమాండ్ పెరిగింది. మూవీకి అది ప్లస్ పాయింట్ గా మారింది. కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకుని ఒకరి చేత ఐటం చేయిస్తున్నారు. ఒక స్పెషల్ సాంగ్ చేసినందుకు  ఈ భామలు 60 నుంచి 65 లక్షలు తీసుకుంటున్నారు. మరి మంచి లాభసాటి బేరమే కదా!

నటి క్యాథరిన్‌ ట్రెసా ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. 2016లో ‘సరైనోడు’ వంటి సూపర్‌హిట్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి ఇప్పుడు మంచి అవకాశాలే వస్తున్నాయి. ’ఖైదీ నంబర్‌ 150’ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమా నుంచి తప్పుకున్నా.. ఈ భామ కెరీర్‌కు పెద్దగా రిస్క్‌ ఎదురుకాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో ఓ స్పెషల్‌ నంబర్‌ కోసం క్యాథరిన్‌ను తీసుకున్నారు.

లావిష్‌గా తెరకెక్కిస్తున్న ఈ ఐటెంసాంగ్‌ కోసం ఈ అమ్మడికి కళ్లుచెదిరే రీతిలో  65 లక్షలు చెల్లించారట. క్యాథరిన్‌కు ఇది నిజంగా చాలా పెద్దమొత్తమే. పూర్తి సినిమా చేసిన ఇంతస్థాయిలో ఆమెకు రెమ్యూనరేషన్‌ దక్కేది కాదని, కానీ ఒక్క పాట కోసమే 65 లక్షలు ఇస్తుండటం పెద్ద విషయమని టాక్ వినిపిస్తోంది. రకుల్‌ ప్రీత్‌, ప్రగ్యా జైస్వల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్‌ మంచి డ్యాన్సర్‌ కావడం.. పాటకు సరిపోయే అందచందాలు తనకు ఉండటంతోనే  ఐటంసాంగ్‌కి ఒప్పించారట.

Have something to add? Share it in the comments

Your email address will not be published.