మావోల దాడిలో 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

Total 11 CRPF Jawans killed in Maoists attack at Sukuma District Chattisghar

Total 11 CRPF Jawans killed in Maoists attack at Sukuma District Chattisghar

ఛత్తీస్‌ఘడ్‌లో మావోలు మరోసారి విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లాలోని బుర్ఖాఫాల్ చింతగుహా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ ఏడుగురిని హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించారు పోలీసులు.

గతంలో సుకుమా జిల్లాలో కూంబింగ్ జవాన్లపై మెరుపుదాడి చేసి 12మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోలు ఈసారి 24మందిని బలి తీసుకున్నారు. అయితే దాడి చేసిన తర్వాత భారీగా ఆయుధాలను ఎత్తుకెళ్ళారు మావోలు. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడే లక్ష్యంగా సుమారు 300మంది మావోలు పోలీసులపై మెరుపుదాడి చేశారు.

మావోల దాడిలో 11మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీస్ ఉన్నతాధికారులు భావించారు. అయితే ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.