బల పరీక్షలో నెగ్గిన సీఎం

TR Zeliang wins floor test in Nagaland

నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ బల పరీక్షలో నెగ్గారు. 59 మంది ఎమ్మెల్యేలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జెలియాంగ్‌కు 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు, నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి (డీఏఎన్) చైర్మన్ టీఆర్ జెలియాంగ్ నాగాలాండ్ 19వ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

TR Zeliang wins floor test in Nagaland

కోహిమాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ పీబీ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ నెల 22లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ జెలియాంగ్‌ను ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారమే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని చెప్పారు జెలియాంగ్. బలనిరూపణ తర్వాతనే మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని జెలియాంగ్ ప్రకటించారు.

See Also: అరుణ్ జైట్లీ ప్రకటించేశారు

ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న షిర్జోలీ లీయెజిత్సు గౌహతి హైకోర్టు ఆదేశించిన ప్రకారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో విఫలమైన కారణంగా జెలియాంగ్ నాగాలాండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.