బ్లేడ్‌తో కోసుకొని వ్యాపారి హంగామా

Traffic police Assault A road side stall owner cuts his body with a blade in Besant Road Vijayawada

Traffic police Assault A road side stall owner cuts his body with a blade in Besant Road Vijayawada copy

విజయవాడలో ట్రాఫిక్ పోలీసుల ఆకృత్యాలకు విసుగు చెందిన ఓ వ్యాపారి హల్‌చల్ చేశాడు. బీసెంట్ రోడ్డులో షాపులకు ముందు వ్యాపారం చేసుకొనే వీధి వ్యాపారుల వల్ల సాయంత్రం సమయంలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువౌతున్నాయని పోలీసులు గత కొన్ని రోజులుగా ట్రాఫిక్‌ను అదుపులోకి తెచ్చేపనిలో పడ్డారు. అందులోభాగంగా పోలీసులు తమనెు వేధిస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. అయితే బీసెంట్ రోడ్డులో వీధి వ్యాపారి సాయంత్రం హల్‌చల్ చేశాడు.

ట్రాఫిక్‌ పేరుతో తమను వ్యాపారం చేసుకోనివ్వడంలేదంటూ ఓ వీధి వ్యాపారి బ్లేడ్‌తో ఒంటిపై కోసుకున్నాడు.వ్యాపారికి తీవ్రగాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్లేడ్‌తో శరీరంపై కోసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటనతో బీసెంట్‌ రోడ్డులో తోటి వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.