ట్రాఫిక్ పోలీస్ దౌర్జన్యం…. చిరువ్యాపారులపై జులుం

Police Over action on small road side vendors in Uppal Hyderabad

Police Over action on small road side vendors in Uppal Hyderabad

హైదరాబాదు పోలీసులు మరో అరాచక పర్వానికి పాల్పడ్డారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ఒంటబట్టించుకున్న పలువురు ట్రాఫిక్ పోలీసులు మామూళ్ళకు బాగానే అలవాటుపడుతున్నారు. రోడ్డు పక్కన సామాన్లు అమ్ముకొనే చిరు వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ నల్ల చెరువు కట్టపై మరోసారి చిన్న చిన్న సామగ్రి అమ్ముకొని జీవనం సాగించే చిరువ్యాపారులపై ట్రాఫిక్‌ పోలీసులు పాశవికంగా వ్యవ హరించారు.

Police Over action on small road side vendors in Uppal Hyderabad

రెండేళ్ళ క్రితం ఇదే ప్రాంతంలో పండ్లు, వేరుశనక్కాయలు అమ్ముకుంటున్న చిరువ్యాపారులపై హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు విరుచుకుపడ్డారు. తోపుడు బండ్లు, బుట్టల్లోని పండ్లు, వేరుశనక్కాయలను చెల్లాచెదురు చేయడంతో పాటు వాటిలో కొన్నింటిని తమ వాహనంలోకి ఎక్కించేశారు. పోలీసుల ఈ అరాచక పర్వాన్ని మొబైల్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తి పంపిన వీడియో వాట్సప్‌లో హల్‌చల్ చేసింది.

ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్ళీ ట్రాఫిక్ పోలీసులు పండ్లు అమ్ముకొనే ఓ చిరు వ్యాపారికి సంబంధించిన పండ్లను నేలకేసి కొట్టాడు. చిరువ్యాపారులమంటూ బాధితులు కాళ్లావేళ్లా పడ్డా పోలీసులు కనికరించలేదు. ఈ విషయాన్ని గమనించిన ఓ యువకుడు వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి, ఫోటోలు తీసి ట్విట్టర్‌లో నేరుగా మంత్రి కెటిఆర్‌ను ట్యాగ్ చేసి ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? అని ప్రశ్నించాడు. దాంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా సర్క్యులేట్ అయ్యాయి.

దీంతో దీనిపై స్పందించిన కేటీఆర్‌.. సదరు జూనియర్ ఆఫీసర్‌పై  అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి కేటీఆర్‌ సూచించారు. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన అవసరముందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Police Over action on small road side vendors in Uppal Hyderabad KTR Tweet

స్పందించిన మంత్రి కెటిఆర్

 

2015లో ఉప్పల్ నల్లచెరువు కట్టపై చిరు వ్యాపారులపై పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియో…

Have something to add? Share it in the comments

Your email address will not be published.