జాగృతికి కొత్త సారథులు

TRS MP kavitha appoints new presidents for Telangana Jagruthi Foreign wings

TRS MP kavitha appoints new presidents for Telangana Jagruthi Foreign wings

తెలంగాణా సంస్క‌ృతీ సంప్రదాయాలను కాపాడుతూ తెలంగాణా ఉద్యమ సమయంలో ప్రజలతో మమేకమవుతూ కీలకపాత్ర పోషించిన తెలంగాణా జాగ‌ృతి ఇటీవలే పదేళ్ళ సంబరాన్ని జరుపుకుంది. కేవలం తెలంగాణాలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణాబిడ్డలను ఏకం చేసేందుకు కృషిచేస్తున్న జాగృతిని ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్ళడంలో సక్సెస్ అయిన నాయకురాలు జాగ‌‌ృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత.

జాగృతి కార్యకలాపాలను మరింత వేగంగా తీసుకెళ్ళేందుకు ప్రపంచంలోని పలుదేశాల్లోని జాగృతి శాఖలకు సారథులను నియమించారు. నూతన అధ్యక్షులు జాగృతి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ అభ్యున్నతికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా బిడ్డల సంక్షేమానికి కృషి చేయాలని కవిత సూచించారు.  అంతేగాక విదేశీ శాఖలతో పాటు మహారాష్ట్ర శాఖకూ కూడా అధ్యక్షులను ప్రకటించారు.

మహారాష్ట్ర అధ్యక్షులు: శ్రీనివాస్ సుల్గేని

ఉత్తర అమెరికా(అమెరికా & కెనడా) అధ్యక్షులు – శ్రీధర్ భండారు
ప్రధాన కార్యదర్శి – సుమంత్ గరకరాజుల.
అమెరికా అధ్యక్షులు – రాజ్ గౌలికర్
కెనడా అధ్యక్షులు – రమేష్ మునుకుంట్ల
యూరప్ అధ్యక్షులు – సంపత్ ధన్నంనేని
యూకే అధ్యక్షులు – సుమన్ బల్మూరి
ఆస్ట్రేలియా అధ్యక్షులు – నిశిధర్ రెడ్డి బొర్ర
న్యూజిలాండ్ అధ్యక్షులు – అరుణ జ్యోతి ముద్దం
జాగృతి గల్ఫ్ దేశాల అధ్యక్షులు – చెల్లంశెట్టి హరిప్రసాద్
బహరైన్ అధ్యక్షులు – బర్కుంట బాబూరావు
కువైట్ అధ్యక్షులు – ముత్యాల వినయ్ కుమార్
యూఎఈ అధ్యక్షులు – కిరణ్ కుమార్ పీచర
సౌదీ అరేబియా అధ్యక్షులు – మహమ్మద్ మొజ్జం

Have something to add? Share it in the comments

Your email address will not be published.