వాళ్ళకి రోజులు దగ్గరపడ్డాయంటున్న ట్రంప్

Trump makes statement on Terror attacks and condemns the bomb blast in Manchester

Trump makes statement on Terror attacks and condemns the bomb blast in Manchester

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షపదవిలోకి వచ్చినప్పటినుండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేసే పనిలో పడ్డారు. అంతేగాక ఐసిస్ వంటి ఉగ్రవాదజాడలు ఉన్న ముస్లిందేశాలపై ద‌ృష్టిసారించిన అగ్ర దేశాధ్యక్షుడు మాంఛెస్టర్‌లో జరిగిన బాంబు పేలుడుపై స్పందించారు. పాలస్తీనా పర్యటనలో ఉన్న ట్రంప్‌  ఉగ్రవాదం గురించి మాట్లాడారు. అంతమంది యువత ప్రాణాలు తీసిన వారు గొప్పగా అనుకుంటున్నారు. కానీ.. వారికి రోజులు దగ్గరపడ్డాయి. ఈ సమాజంలో ఉగ్రవాదం.. జాతి వివక్షను తుదముట్టించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అన్ని దేశాలు చేతులు కలపాలి అని పిలుపునిచ్చారు డోనాల్డ్ ట్రంప్.

అంతేగాక అమాయక ప్రజలను పొట్టబెట్టుకున్న వారికి అంతం తప్పదని హెచ్చరించారు. ఈ మాంచెస్టర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ట్రంప్ సంతాపం తెలిపారు. బ్రిటన్‌ ప్రజలకు తాము అండగా ఉంటామన్న ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని పిలుపునిచ్చారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.