ట్రంప్ ఎఫెక్ట్: అమెరికా చదువులు మాకొద్దంటున్న విద్యార్థులు

Trump's immigration ban is already having a chilling effect on International students

Trump's immigration ban is already having a chilling effect on International students

పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణసంకటంలా తయారయ్యాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొనే నిర్ణయాలు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో… దానివల్ల తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియక సతమతమవుతున్నారు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రజలు. ఇప్పుడు ఈ జాబితాలోకి విదేశీ విద్యార్థులు సైతం వచ్చి చేరారు. అమెరికాలో ఉన్నతాభ్యాసం కోసం వెళ్ళే విద్యార్థుల సంఖ్య ట్రంప్ పుణ్యమాని భారీగా పడిపోయింది.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిబంధ‌న‌ల ఫ‌లితంగా ఆ దేశంలోని యూనివ‌ర్సిటీల్లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్య త‌గ్గిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే 250కి పైగా అమెరికన్ కాలేజీల్లో, ఆరు టాప్ అమెరికన్ హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రూప్స్‌లో భారతీయుల అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తులు సంఖ్య 26 శాతం త‌గ్గిపోయిందని ఓ సర్ట్లువేలో తేలింది. అంతేగాక మొత్తం గ్రాడ్యుయేట్ ద‌ర‌ఖాస్తులు సంఖ్య సైతం 15 శాతం తగ్గిపోయింది.

మ‌రోవైపు అమెరికాలో చ‌దివే విదేశీ విద్యార్థుల్లో స‌గం శాతం మంది విద్యార్థులు చైనా, భారత్ కు చెందిన విద్యార్థులే ఉంటారు. చైనా నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ద‌రఖాస్తుల సంఖ్య 25 శాతం, గ్రాడ్యుయేట్ స్టడీస్ ద‌ర‌ఖాస్తుల సంఖ్య 32 శాతం త‌గ్గిపోయాయని సర్వే చెబుతోంది.  అమెరికాలో విదేశీ విద్యార్థుల అప్లికేషన్ల సంఖ్య కూడా సగటున 40 శాతం త‌గ్గాయి. ఈ ప్రభావం భవిష్యత్తులో కూడా ఉండ‌నుంద‌ని స‌ర్వేలో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం కఠినతరమైన వీసా నిబంధనలతో పాటు అమెరికాలో జాతి విద్వేషపూరిత దాడులు జ‌రుగుతున్న నేపథ్యంలో ఈ విషయాలు బయటపడ్డాయి.

 

మొత్తానికి అమెరికాలో చదువుకుంటేనే చదువు అబ్బుతుందనుకొనే తల్లిదండ్రులు, విద్యార్థులకు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్న షాక్‌లు బాగా గట్టిగానే తాకుతున్నాయని అర్థమౌతోంది

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.