‘రెండాకుల’ కోసం లంచం ఇవ్వలేదంటున్న దినకరన్

TTV Dinakaran: Delhi police files bribery case against him as he wanted to buy AIADMK symbol for 50 Lakhs

TTV Dinakaran: Delhi police files bribery case against him as he wanted to buy AIADMK symbol for 50 Lakhs

తమిళనాడు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ పరువు తీసేస్తున్నాయి. జయలలిత మరణించిన తర్వాత రెండుగా విడిపోయిన అన్నాడీఎంకే పార్టీ గుర్తుకోసం 50లక్షల లంచం ఎరగా చూపారని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ‘రెండాకుల’ గుర్తు కోసం ఉప ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ 50కోట్ల లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

పార్టీ రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు రూ. 50కోట్లు ఇచ్చేందుకు దినకరన్‌ ప్రయత్నించారంటూ దిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆరోపిస్తున్నారు. లంచం ఇచ్చేందుకు వచ్చిన సుఖేశ్‌ చంద్రశేఖర్‌ అనే మధ్యవర్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సుఖేశ్‌ వెల్లడించిన వివరాల మేరకు దినకరన్‌పై లంచం కేసు నమోదు చేశారు.

అయితే తనపై వస్తున్న వార్తలను ఆ పార్టీ  ఖండించారు. సుఖేశ్‌ చంద్రశేఖర్‌ అనే పేరుతో తనకెవరూ తెలియదని, తను ఎవరికీ దేని కోసం లంచం ఇవ్వలేదని, ఒకవేళ ఈ కేసులో దిల్లీ పోలీసుల నుంచి నాకు సమన్లు అందితే న్యాయపరంగా ఎదుర్కొంటానని ధీమాగా చెబుతున్నారు దినకరన్‌.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.