క్యాబ్‌లో యువతిపై అత్యాచారయత్నం

two held for trying to rape woman in hyderabad out skirts
  • గమ్యస్థానం చేరుస్తామంటూ యువకుల మోసం 
  • సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్న హైదరాబాద్‌ పోలీసులు

రహదారిపై ఒంటరిగా వేచిఉన్న యువతిని గమ్యస్థానం చేరుస్తామంటూ ఇద్దరు యువకులు నమ్మించారు. క్యాబ్‌ ఎక్కించుకుని 45 కి.మీ ప్రయాణించాక కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. ఆమె అరుపులతో స్థానికులు అప్రమత్తం కావడంతో యువకులు పరారయ్యారు.

ఎల్బీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం, ఎల్బీనగర్‌ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు ఓ యువతి విజయవాడ వెళ్లేందుకు జాతీయ రహదారిపై వేచి ఉంది. అక్కడే ఉన్న నలుగురు యువకుల్లో ఇద్దరు ఆమెపై కన్నేశారు. తమ స్నేహితుడైన క్యాబ్‌డ్రైవర్‌ వద్ద వాహనాన్ని తీసుకుని ఆమె ముందు ఆపి ఎక్కడికెళ్లాలని అడిగారు. విజయవాడ వరకూ దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌గేట్‌ దాటాక ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. ఆమె అరుపులు విని అక్కడి స్థానికులు కారును ఆపేందుకు యత్నించగా, యువతిని అక్కడే వదిలి ఇద్దరూ కారుతో సహా పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదుమేరకు చౌటుప్పల్‌ ఠాణాలో నిర్భయకేసు నమోదైంది. తర్వాత ఎల్బీనగర్‌ ఠాణాకు కేసు బదిలీ అయింది. ఈ కేసును ఛేదించే పనిని ఉన్నతాధికారులు రాచకొండ ఎస్ఓటీ బృందానికి అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింగరావు పర్యవేక్షణలో ఎస్సైలు కాశీవిశ్వనాథ్‌, ఆంజనేయులు ఆధ్వర్యంలో 3 బృందాలుగా విడిపోయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్యాబ్‌ ఆచూకీ కనిపెట్టారు. అత్యాచారయత్నం చేసినవారు మౌలాలికి చెందిన సదరు యువకులుగా గుర్తించారు. అందులో జైపూరి కాలనీకి చెందిన మహెష్ ఇటీవల ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. మరో వ్యక్తి నేరేడ్ మెట్ కు చెందిన నికోలస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకోని అంబర్ పేట్ ఎస్ఓటీ పోలీస్ లు స్టేషన్ కు తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.