వాహనం ఢీ, ఇద్దరు యువకులు మృతి

వాహనం ఢీ, ఇద్దరు యువకులు మృతి

అనంతపురం: అనంతపురం జిల్లా నల‍్లచెరువు మండలపరిధిలోని పెద్ద ఎల్లంపల్లి జాతీయరహదారిపై శనివారం వేకువజామున ద్విచక్రవాహనాన్ని క్వాలిస్‌ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్ధానికులు తెలిపిన వివరాల మేరకు.. కదిరి నుంచి తనకల్లుకు ద్విచక్రవాహనంలో వెళుతుండగా తనకల్లు వైపు నుంచి ఎదురుగా వచ్చే క్వాలిస్‌ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు.

దీంతో ఇరువురు రవిశంకర్‌ (25), రాజశేఖర్‌ (25) యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతిచెందారని తెలిపారు. యువకులు కుటాగుళ్లకు చెందినవారని, సినిమాకు వెళుతుండగా రోడ్డుప్రమాదంలో మృతి చెందారని బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.