2,500/-లకే విమాన టికెట్లు

 

విమాన ప్రయాణం ఇకనుండి ధనికులకు మాత్రమేకాకుండా పేదలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చే ఉడాన్ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంలో భాగంగా  మొట్టమొదటి ‘ఉడాన్’ ప్రాంతీయ విమానాలను   హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ప్రధాని  ప్రారంభించారు. విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళిలో భాగంగా ఉడాన్‌ ​విమానానికి జెండా ఊపి దేశవ్యాప్తంగా  ఉడాన్ సేవలను మొదలుపెట్టారు. దేశీయ  విమానయారంగం భారీ అవకాశాలతో నిండి ఉందని  తెలిపారు మోడీ.

Udan Scheme takes off by Modi Air travel not just for rich anymore

సిమ్లా-ఢిల్లీ మార్గంతో సహా,  కడప-హైదరాబాద్‌, నాందేడ్‌-హైదరాబాద్‌ మార్గాల్లోనూ ఉడాన్‌ విమాన సర్వీసులను  మోదీ ప్రారంభించారు. ప్రపంచ విమానయాన రంగంలో ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రధానమంత్రి  పదవిని చేపట్టిన అనంతరం  సిమ్లాకు రావడం ఇదే  మొట్టమొదటి సారి . ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 2003 లో హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో పర్యటించారు.
కాగా గంట ప్రయాణానికి రూ.2,500 మాత్రమే వసూలు చేయాలనే ఉద్దేశంతోఅందుబాటులోకి తీసుకువస్తామని మోదీ సర్కార్ గత ఏడాది ప్రకటించింది.

ట్యాక్సీల్లో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు సుమారు రూ.10 ఖర్చు అవుతుందని.. ఉడాన్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌కు రూ.6 నుంచి రూ.7 వరకు మాత్రమే ఉంటుందని మోదీ తెలిపారు. ఉడాన్‌ సర్వీస్‌లో గంటలోపు ప్రయాణానికి రూ.2,500 ఖర్చవుతుందని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టైర్‌-2, టైర్‌-3 నగరాలకు విమాన సేవలు అందిస్తే ప్రయోజనం కలుగుతుందని మోదీ తెలిపారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.