చంద్రబాబుకు లేఖరాసిన ఉండవల్లి

Undavalli Arun Kumar fires on Chandrababu Naidu for misusing cable system

కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వ అధీనంలోని ఫైబర్ నెట్ వర్క్ యాజమాన్యం కనెక్షన్లు అమ్మేయాలని ఎమ్.ఎస్.ల మీద ఒత్తిడి తెస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.

Undavalli Arun Kumar fires on Chandrababu Naidu for misusing  cable system

ప్రభుత్వం 149 రూపాయలకే కేబుల్ కనెక్షన్లు కోరుకున్న వారికే ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఎమ్మెస్వోలను గదమాయించి, కేబుల్ వైర్లు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. గత 30ఏళ్ళుగా కేబుల్ వ్యవస్థ ను తమ సొంతంగా పెట్టుబడులు పెట్టుకుని తీర్చిదిద్దుకుని, లక్షలాది మంది ఉపాధి పొందుతుంటే కుప్పకూల్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని ఉండవల్లి ఆరోపించారు.

కేబుల్ కనెక్షన్లు 149 రూపాయలకు కోరుకునే వారికివ్వాలి కానీ..బలవంతంగా ఎమ్మెస్వోలు, లోకల్ కేబుల్ ఆపరేటర్ల నుంచి కనెక్షన్లు లాక్కోవడం దారుణమని ఉండవల్లి అన్నారు. కేబుల్ వ్యవస్థను చేతుల్లోకి లాక్కోవలనే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని ఉండవల్లి ఆరోపించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు టెరా సాఫ్ట్ వేర్ లిమిటెడ్ అనే బ్లాక్ లిస్ట్ చేయబడిన కంపెనీకి ఇచ్చారన్నారు. ఫైబర్ గ్రిడ్ లో 149 కనెక్షన్ తీసుకోవాలంటే 4 వేలతో సెట్ ఆఫ్ బాక్స్ కొనుగోలు చేసుకోవడం ఎంతమంది కి సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ఈ విషయంపై  ఉండవల్లి అరుణ్‌కుమార్ సిఎం చంద్రబాబునాయుడికి ఓ లేఖరాశారు..

Have something to add? Share it in the comments

Your email address will not be published.